OTT Movie : పేద కుటుంబంలో పుట్టి, చిన్నతనంలోనే తండ్రి కోల్పోవడంతో జీవితంలో ఎదగడానికి ఓ అమ్మాయి ఏం చేసింది అనే కథను ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. పేద వాళ్ళతో పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కూడా కనెక్ట్ అయ్యే ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ అమెరికన్ క్రైమ్ కామెడీ మూవీ పేరు’బఫెలోడ్’ (Buffaloed). 2019 లో వచ్చిన ఈ సినిమాకి తాన్యా వెక్స్‌లర్ దర్శకత్వం వహించారు. ఇందులో జోయ్ డియూచ్ ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ఇందులో నటించిన పెగ్ డహ్ల్ పాత్రకు గానూ ప్రశంసలను అందుకుంది. జూడీ గ్రీర్, జెర్మైన్ ఫౌలర్, నోహ్ రీడ్, జై కోర్ట్నీ కూడా సహాయక పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
పెగ్ డహ్ల్ న్యూయార్క్‌లో ఒక పేద కుటుంబంలో పుడుతుంది. ఆమె తండ్రి చిన్నతనంలోనే మరణిస్తాడు. దీనివల్ల ఆమె తల్లి కాథీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటుంది. షాప్ పెట్టుకునే స్తోమత లేకపోవడంతో, ఇంట్లోనే హెయిర్ సలూన్ నడుపుతుంది. పెగ్ తన జీవితాన్ని మార్చుకోవాలని, వాల్ స్ట్రీట్‌లో విజయవంతమైన జీవితాన్ని సాధించాలని కలలు కంటుంది. ఆమె తన టాలెంట్ తో విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఒక సీటు కూడా సంపాదిస్తుంది. ఆమె కలలు కన్న విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ లెటర్ వచ్చినప్పటికీ, ట్యూషన్ ఫీజు చెల్లించడం ఆమెకు కష్టంగా మారుతుంది. డబ్బు సంపాదించడానికి ఆమె ఒక షోలో బ్లాక్ టిక్కెట్లను కూడా అమ్ముతుంది. కానీ ఈ పని వల్ల ఆమె జైలుకు వెళ్లాల్సి వస్తుంది.
Read Also : వామ్మో.. ఇదేం క్లైమాక్స్ రా బాబు.. మెంటలెక్కిపోవ్వడం పక్కా..
జైలులో కూడా సిగరెట్లు, గుట్కాలను అమ్ముతూ సంపాదిస్తుంది. ఇక ఆమె జైలు నుండి విడుదలైన తర్వాత, తన అన్న ఆర్థిక ఇబ్బందులో ఉన్నాడని గుర్తిస్తుంది. వడ్డీకి ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి అప్పు తీసుకొని ఉంటాడు. కలెక్షన్ ఏజెన్సీ నుండి అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ పెగ్ తీసుకుని వాళ్ళకు తనదైన స్టైల్లో సమాధానం చెప్తుంది. ఇక ఆమె తెలివి తేటలను ఉపయోగించి, కలెక్షన్ ఏజెన్సీకి చెందిన మొండి బకాయిలను వసూలు చేస్తుంది. ఈ క్రమంలో ఆమె కూడా సొంతంగా ఒక రికవరీ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలౌతుంది. ఆ సంస్థ యాజమాని తనని చాలా ఇబ్బంది పెడతాడు. చివరికి పెగ్ సొంత కంపెనీని స్టార్ట్ చేస్తుందా ? డబ్బులు సంపాదిస్తుందా ? ఆమె ఎదుర్కునే సంఘటనలు ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.