BigTV English

OTT Movies : థ్రిల్లింగ్ స్టోరీతో మూవీ..మసి పూసి మారేడుకాయ చేసే ప్రేమ జంట.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

OTT Movies : థ్రిల్లింగ్ స్టోరీతో మూవీ..మసి పూసి మారేడుకాయ చేసే ప్రేమ జంట.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

OTT Movies : థ్రిల్లింగ్ స్టోరీతో కొత్త సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు ఉత్కంఠ భరితమైన స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో కొన్ని థ్రిల్లర్, హారర్, సస్పెన్స్ స్టోరీలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో వచ్చే కొత్త సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇదొక ప్రేమ జంట స్టోరీ.. దొంగతనం కోసం ఎంతకైన తెగిస్తారు.. ఆ మూవీ పేరు ‘జిగేల్’ స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


స్టోరీ విషయానికొస్తే.. 

జిగేల్ మూవీ రిలీజ్ అయ్యి మూడు నెలలు అయ్యింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. తెలుగు, తమిళంలో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. అప్పుడప్పుడు హీరోగానూ పలు చిత్రాల్లో నటించారు. అలానే ‘జిగేల్’ అనే మూవీ.. ఈ మార్చి ఫస్ట్ వీక్ లో థియేటర్లలోకి వచ్చింది. అక్కడ స్టోరీ బాగుందనే టాక్ ను సొంతం చేసుకున్నా కూడా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. ఈ మూవీలో ఓ ప్రేమ జంట చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. లాకర్లని చాకచక్యంగా తెరిచే టాలెంట్ ఉన్న నందు., మీనాతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి రాజాచంద్ర వర్మ ప్యాలెస్‌లో పాతకాలం నాటి లాకర్‌పై కన్నేస్తారు. ఇక మీనా ఆ ప్యాలెస్ లో ఉండే జేపీ దగ్గర పీఏగా జాయిన్ అవుతుంది. ఆ లాకర్ ని ఎలా ఓపెన్ చేయాలి అని అక్కడ ఉండే స్కెచ్ వేస్తుంది. వీరిద్దరూ కలిసి లాకర్ కొట్టేశారా..? లాకర్లో ఎంత నిధి ఉంది అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాని కచ్చితంగా చూసేయాల్సిందే..


సన్ నెక్స్ట్ ఓటీటీ..

జిగేల్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులోకి రానుంది? ఈ మూవీలో పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎలా వచ్చిందో అలా కనుమరుగైపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాబోతుందని ప్రకటించారు.. జూన్ 5 గురువారం నుంచే మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి స్ట్రీమింగ్ కు రాబోతుంది. సస్పెన్స్ స్టోరీ చూడాలని అనుకొనేవారికి ఈ మూవీ బెస్ట్ చాయిస్.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ మూవీని చూసి ఎంజాయ్ చెయ్యండి.

ఇటీవల కాలంలో ఓటీటీలోకి ఎలాంటి స్టోరీలు అయినా కానీ సినిమాలో వస్తే కచ్చితంగా భారీ వ్యూస్ ని రాబడుతున్నాయి.. స్టార్ హీరోల సినిమాల కంటే చిన్న సినిమాలే ఇక్కడ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటున్నాయి. ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ సరికొత్త సినిమాలను స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ నెలలో కొత్త సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

Tags

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×