BIG TV LIVE Originals: హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సిరీస్ లుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అందులో ఒకటి ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్. ఈ సినిమాలోని ప్రధాన ఘటనలు.. ఒక వ్యక్తి తన మరణాన్ని ముందుగా చూసి, ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత మరణం వారిని వెంటాడడం జరుగుతుంది. ఈ సినిమాలలో చూపించిన కొన్ని ప్రమాదాలు, మరణాలు నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండి ప్రేరణ పొందాయి.
1981 హయత్ రీజెన్సీ విపత్తు
1981లో మిస్సోరిలోని కాన్సాస్ నగరంలోని హయత్ రీజెన్సీ హోటల్ లో ఘోర ప్రమాదం జరిగింది. జూలై 17న, టీ డ్యాన్స్ అనే సరదా కార్యక్రమం జరుగుతుండగా, హోటల్ లాబీ పైన వేలాడుతున్న రెండు వాక్ వేలు కూలిపోయాయి. ఈ ఘటనలో 114 మంది మరణించారు. 216 మంది గాయపడ్డారు. డిజైన్ లోపం కారణంగా వాక్ వేలు కూలిపోయాయి. అమెరికా చరిత్రలోనే ఘోర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
‘ఫైనల్ డెస్టినేషన్’ అంటే ఏంటి?
‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్’ అనేది 2025లో విడుదలైన హాలీవుడ్ మూవీ. ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్ లో ఆరవ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ స్టెఫానీ రేయెస్ అనే కాలేజీ విద్యార్థిని చుట్టూ తిరుగుతుంది. 1968లో ఎత్తైన రెస్టారెంట్ టవర్ స్కై వ్యూ ప్రదేశంలో జరిగిన ఘోర ప్రమాదాల గురించి ఆమెకు భయంకరమైన కలలు వస్తాయి. ఆమెకు వచ్చిన కలల్లో అమ్మమ్మ ఐరిస్, షాండ్లియర్ పడిపోవడం, గ్యాస్ లీక్ కారణంగా కూలిపోయిన ఘటన నుంచి తప్పించుకుంటుంది. 2024లో ఆమెను మరణం ఆవహిస్తుంది. ఈ సినిమా సిరీస్ లోని ఇతర చిత్రాల మాదిరిగానే భయంకరమైన ప్రమాదాలతో మరణాలతో నిండి ఉంటుంది.
‘హయత్ రీజెన్సీ’ ఘటన నుంచి ప్రేరణ పొందిందా?
1981 హయత్ రీజెన్సీ ఘటన ‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్’ సినిమా ప్రేరేపించినట్లు స్పష్టమైన రుజువు లేదు. కానీ, ఈ సినిమా 1968లో హయత్ లాంటి ఓ నిజమైన హోటల్ లో కాకుండా ఒక కల్పిత టవర్ దగ్గర జరుగుతుంది. సినిమాలో విపత్తుకు కారణం (షాండ్లియర్, గ్యాస్ పేలుడు) కూడా హయత్ స్కైవాక్ డిజైన్ లోపం మాదిరిగానే కుప్పకూలినట్లు చూపిస్తారు. ఫైనల్ డెస్టినేషన్ సినిమాలు సాధారణంగా నిజమైన సంఘటనలను చూపించకుండా, విమాన ప్రమాదాలు, వంతెన కూలిపోవడం లాంటి ప్రమాదాలను చూపించారు. ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ లో ఒకసారి మరణం నుంచి తప్పించుకునే వ్యక్తుల గురించి కథతో ప్రారంభమైంది. ఈ ఆలోచన జెఫ్రీ రెడ్డిక్ అనే రచయిత నుంచి వచ్చింది. అయితే, తాజా చిత్రంలో హయత్ ఘటన గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఇది హయత్ ఘటన ఆధారంగా తెరకెక్కలేదని చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. ఎగిరి వంతెనను పట్టుకుని.. ఏం జంప్ చేశావ్ గురూ!