Hyderabad : సూట్‌కేసులో మహిళ డెడ్‌బాడీ. ఇలాంటి ఘటనలు ఈమధ్య ఎక్కువ అవుతున్నాయి. గతంలో సినిమాల్లో మాత్రమే కనిపించేవి. చంపేసి.. బాడీని ముక్కలుగా నరికేసి.. సూట్‌కేసులో కుక్కేసి.. గుర్తుతెలియని చోట పడేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. గతంలో నార్త్ ఇండియాలో ఇలాంటి కేసు ఒకటి సంచలనం సృష్టించింది. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో సూట్‌కేసులో గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపుతోంది.
బాచుపల్లిలో మిస్టరీ డెత్
అది హైదరాబాద్, బాచుపల్లిలోని విజయ దుర్గా ఓనర్స్ అసోసియేషన్ కాలనీ. పొదలతో కూడిన ఖాళీ ప్రదేశం. అక్కడి నుంచి దుర్వాసన వచ్చింది. ఆ స్మెల్ మరీ దారుణంగా ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఖాకీలు వచ్చి చూసే సరికి అక్కడో సూట్‌కేస్ పడి ఉంది. అందులోంచే వాసన వస్తోంది. దాన్ని ఓపెన్ చేసి చూసి.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సూట్‌కేసులో యువతి డెడ్‌బాడీ ఉంది.
గాయాలు లేవు.. సాక్ష్యాలు లేవు..
చనిపోయిన మహిళ వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చు అంటున్నారు. మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది. అప్పటికే డెడ్‌బాడీ బాగా కుళ్లిపోయి ఉంది. యువతి ఆనవాళ్లు గుర్తించడం కష్టంగా మారింది. ఘటన జరిగి 10-12 రోజులు జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. పొడిచినట్టు, కొట్టినట్టు ఆనవాళ్లు ఏమీ లేవు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తేనే కానీ ఆ యువతి ఎలా చనిపోయిందో తెలుస్తుందని అంటున్నారు.
Also Read : రీల్స్ చేస్తూ.. ఆరుగురు అక్కాచెళ్లెళ్లు మృతి..
మెరూన్ కలర్ డ్రెస్సే ఆధారం..
ఆ యువతిని వేరే ప్రదేశంలో ఎక్కడో చంపేసి.. డెడ్‌బాడీని సూట్‌కేసులో పెట్టి.. బాచుపల్లిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీపంలోని సీసీకెమెరాల ఫూటేజ్ చెక్ చేస్తున్నారు. బహుషా ఇది ఆ యువతికి తెలిసిన వారి పనే కావొచ్చని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళల మిస్సింగ్ కేసులు ఎక్కడ ఫైల్ అయ్యాయో ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ కేసుల వివరాలు తెలిస్తే.. మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్న యువతి ఎవరో గుర్తిస్తే.. కేసు చిక్కుముడి వీడే ఛాన్స్ ఉంటుంది. డెడ్‌బాడీ ఐడెంటిఫై అయితే.. ఆ తర్వాత చంపింది ఎవరో ట్రేస్ చేయొచ్చు అంటున్నారు కూకట్‌పల్లి పోలీసులు.