BigTV English

Kamal Haasan Thug Life : అసలే బిగ్ డిజాస్టర్… అందులో మళ్లీ భారీ కోతలు ?

Kamal Haasan Thug Life : అసలే బిగ్ డిజాస్టర్… అందులో మళ్లీ భారీ కోతలు ?

Kamal Haasan Thug Life OTT : కమల్ హాసన్‌కు సినిమా కెరీర్ దాదాపు ముగింపు దశకు వచ్చింది అని అనుకునే టైంలో ‘విక్రమ్’ మూవీ వచ్చింది. అది ఆయనకు ఇది వరకు ఉన్న పేరును అంతా పక్కన పెట్టి… మంచి హిట్‌ను ఇచ్చింది. దీని తర్వాత ‘ఇండియన్ 2’ ఎప్పటిలానే దారుణమైన రిజల్ట్‌ను ఇచ్చింది.


ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘థగ్ లైఫ్’ అయితే మరీ దారుణం. బిగ్ డిజాస్టర్ అవ్వడమే కాదు… ‘ఇండియాన్ 2’ కంటే కూడా తక్కువ కలెక్షన్లు వచ్చాయి దానికి. మణిరత్నం – కమల్ హాసన్ కాంబో అని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.

ఇక నిర్మాతలు అయితే ఈ సినిమాతో భారీ స్థాయిలో నష్టపోయినట్టు తెలుస్తుంది. 9 రోజుల్లో ఈ సినిమాకు దాదాపు 90 కోట్లే వచ్చినట్టు సమచాారం. దాదాపు 300 కోట్లు కుమ్మరించిన నిర్మించిన ఈ సినిమాకు 10 రోజులకు కూడా 100 కోట్లు వచ్చే పరిస్థితి లేదంటే, ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో నిర్మాతలకు ఓటీటీ రైట్స్ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్ ఇచ్చిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


థగ్ లైఫ్ మూవీ రిలీజ్‌కు ముందు సినిమాపై భారీ హైప్ ఉండేది. ట్రైలర్ కూడా వర్కౌట్ అయింది. దాని కంటే ముందు అక్కడ మణిరత్నం – కమల్ హాసన్ కాంబో. ఈ ఒక్క దానితోనే సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ అయిపోయింది. అందుకే బిజినెస్ అనుకున్న దాని కంటే బాగా జరిగింది.

ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బానే జరిగింది. ఓటీటీ రైట్స్ కోసం చాలా పోటీ వచ్చిందనే టాక్ అప్పట్లోనే వినిపించింది. ఫైనల్‌గా నెట్‌ఫ్లిక్స్ 130 కోట్ల భారీ ధరకు థగ్ లైఫ్ ఓటీటీ రైట్స్ ను దక్కించుకుంది. అది కూడా 8 వారాల డీల్. అంటే సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు బానే ఉంది. కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరి ముఖచిత్రాలు మారిపోయాయి. మణిరత్నం అభిమానులు కూడా సినిమాపై విమర్శలు గుప్పించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పటికే భారీ లాస్ వచ్చింది నిర్మాతలకు. ఇక్కడ నిర్మాతలు అంటే ఎవరో కాదు… కమల్ హాసన్, మణిరత్నమే. వారు ఇద్దరు కలిసే ఈ సినిమాను భారీ బడ్జెట్ పెట్టి నిర్మించారు.

కానీ, ఇప్పుడు బిగ్ డిజాస్టర్ అయిపోయింది. నష్టం కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. ఇలాంటి టైంలో ఓటీటీ డీల్ గురించి కమల్ హాసన్ మరోసారి ఆలోచించారట. 8 వారాలు కాకుండా ముందే స్ట్రీమింగ్‌కు ఇస్తే కొంత వరకు డబ్బులు రాబట్టొచ్చు అని అనుకున్నారట. కానీ, కమల్ హాసన్‌కు నెట్ ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్టు సమాచారం.

8 వారాల డీల్ ను రద్దు చేసి.. 4 వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేలా కొత్త డీల్ చేసుకోవాలని, అలాగే, 130 కోట్లు కాకుండా, అందులో నుంచి 30 – 35 శాతం తగ్గించుకుంటామని కమల్ హాసన్ అండ్ మణిరత్నంతో నెట్‌ ఫ్లిక్స్ తెల్చి చెప్పిందట. అదే జరిగితే కమల్ హాసన్ అండ్ మణిరత్నం కు మరో 40 కోట్ల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×