Kavya Maran ..కావ్య మారన్ (Kavya Maran).. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ అయిన ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్న వయసులోనే వేలకోట్లకు అధిపతిరాలు అయిన ఈమె.. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను ప్రేమించిందని, త్వరలోనే అతనితో ఏడడుగులు వేయబోతోంది అంటూ ఒక వార్త కోలీవుడ్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. గత ఏడాది కాలంంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి కావ్య మారన్ రిలేషన్ లో ఉన్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వీరిద్దరి మధ్య పరిచయం ఎక్కడ? ఎలా మొదలైంది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ తో కావ్య మారన్ పెళ్లి..
ఆయన ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran). ముఖ్యంగా కోలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన కావ్య మారన్ తో ఏడడుగులు వేయబోతున్నారు అంటూ ఒక వార్త గుప్పుమంది. గత ఏడాదికాలంగా ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని, పైగా ఏడాది క్రితం వీరిద్దరూ లాస్ వేగస్ లో కలిసి తిరుగుతూ కనిపించారని, దీనికి తోడు ఇటీవల ఒక ప్రైవేట్ డిన్నర్ లో కూడా కలిశారని, వీరిని ప్రత్యక్షంగా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు.
వివాహ వార్తలకు కారణం?
అంతే కాదు వీరిద్దరూ త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. పైగా వీరిద్దరికీ 2014 నుంచే పరిచయం ఉందని, అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారని, అయితే ఈ విషయం ఎక్కడ బయటపడకుండా రహస్యంగా మైంటైన్ చేస్తున్నారని, ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకొని సడన్ ఫిస్ట్ ఇవ్వబోతున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. దీనికి తోడు వీరిద్దరూ తమిళం కావడంతో ఇది నిజమేనని, పైగా ఇరు కుటుంబాల నుంచి వీరి ప్రేమకు ఎటువంటి అడ్డంకి లేదని, అందుకే ఇప్పుడు పెద్దల అంగీకారంతోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త మాత్రం కోలీవుడ్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అనిరుధ్ రవిచంద్రన్ కెరియర్..
అనిరుధ్ రవిచంద్రన్ విషయానికి వస్తే.. సంగీత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ధనుష్ (Dhanush), శృతిహాసన్(Shruti Haasan) కలయికలో వచ్చిన ‘3’ సినిమాలో ఈయన స్వరపరిచిన ‘వై దిస్ కొలవరి ఢీ’ పాటతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. లయోలా కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేసిన ఈయన పలువురు స్టార్ హీరోల చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు.ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు.
Also read: HBD Sreeleela: శ్రీలీల ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా?
కావ్య మారన్ కెరియర్..
కావ్య మారన్ విషయానికి వస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు . ఈమె ఇప్పటికే తండ్రితో పాటు పలు వ్యాపారాలలో కూడా అత్యంత కీలకంగా మారింది. వీటితో పాటు ఐపీఎల్ లో కూడా హైదరాబాదు జట్టుకి యజమానిగా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.