BigTV English

OTT Movie : స్పెయిన్ లో జరిగిన రియల్ స్టోరీ… ఓటీటీని ఊపేస్తున్న ఈ మూవీని ఇంకా చూడలేదా?

OTT Movie : స్పెయిన్ లో జరిగిన రియల్ స్టోరీ… ఓటీటీని ఊపేస్తున్న ఈ మూవీని ఇంకా చూడలేదా?

OTT Movie : రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. 56 దేశాల్లో ఈ సినిమా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో కూడా టాప్ లేపుతోంది. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన ఒక మహిళ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. లగ్జరీ లైఫ్ కోసం, ప్రియుడితో కలసి సొంత భర్తనే చంపుతుంది ఓ కిలాడి లేడి. ఇది స్పెయిన్ లో రియల్ గా జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ క్రైమ్ అప్పట్లో ఒక  సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఆ తరువాత ఆ లేడీకి 22 సంవత్సరాల జైలు శిక్ష, ప్రియుడికి 17 సంవత్సరాల శిక్ష విధించారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

సినిమా స్టోరీ మజె అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త ఆంటోనియోతో కలసి జీవిస్తుంటుంది. 35 సంవత్సరాల ఆంటోనియో ఒకరోజు హత్యకు గుర వుతాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆంటోనియోను ఒక గ్యారేజ్‌లో కత్తితో పొడిచి దారుణంగా చంపి ఉంటారు. ఆ తరువాత ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఈ దర్యాప్తులో మజెకు అనేక మందితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె సాల్వా అనే తన సహోద్యోగితో కూడా సన్నిహిత సంబంధం కొనసాగిస్తుంటుంది. తన భర్తను చంపమని ప్రియుడిని ప్రేరేపిస్తుంది. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ అతని మైండ్ సెట్ మారుస్తుంది. ఈ క్రమంలోనే ఆంటోనియోని దారుణంగా హత్య చేస్తారు.


ఇక ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు మజెను నిందితురాలిగా చేరుస్తారు.  ఆతరువాత ఈ కేసునుంచి బయటపడటానికి ఆమె ఒక పోలీసు అధికారితో కూడా సంబంధం పెట్టుకుంటుంది. ఈ విషయం ప్రియుడికి తెలియడంతో ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. చివరిలో మజెకి  ప్రియుడు ఇచ్చే షాక్ ఏంటి? ఆమె తన భర్తను ఎందుకు చంపాలనుకుంటుంది ? ఆమె ఎంత మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : రెండ్రోజుల క్రితమే చనిపోయిన ఫ్రెండ్ నుంచి మెసేజ్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హార్రర్ కథా చిత్రమ్

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది బ్లాక్ విడో’ (La Viuda Negra). 2025 లో వచ్చిన ఈ సినిమా కార్లోస్ సెడెస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో  ఇవానా బాక్వెరో , ట్రిస్టన్ ఉల్లోవా, కార్మెన్ మాచి వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.  మే 30న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో విడుదలైంది. ఈ క్రైమ్ మూవీ ప్రపంచ ప్రేక్షకులకు ఒక మరచిపోలేని థ్రిల్లర్ ని అందిస్తోంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×