Gundeninda GudiGantalu Today episode june 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. సుమతి రవి తో క్లోజ్ గా ఉండడం ఓర్వలేని ప్రభావతి శృతికి క్లాస్ పీకుతుంది. సుమతికి వార్నింగ్ ఇవ్వాలని కోరుతుంది. శృతి మాత్రం బయటకు వచ్చి అందరికి అభిప్రాయం కనుక్కుంటుంది. రవి, శృతి క్లోజ్ గా ఉండటం మీకు ఎవరికైనా అభ్యంతరంగా ఉందా అనేసి అడుగుతుంది. మా సుమతి చాలా మంచిది మాకెందుకు అభ్యంతరమవుతుందని బస్తీ జనాలు అంటారు. ఇక రవి శృతి ఏమైంది ఏం చేస్తున్నావ్.? నాకేమీ అనుమానం లేదు మీ అమ్మకే అనుమానంగా ఉంది అందుకే క్లారిటీ ఇద్దామని ఇలా తీసుకొచ్చాను అని శృతి ప్రభావతికి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది.. ఎప్పటిలాగే ప్రభావతికి సత్యం క్లాస్ పీకుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. మాజీ ఎమ్మెల్యే వీరబాబు సామూహిక వివాహాలు చేసి హైకమాండ్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని 250 మందికి పెళ్లి చేసేందుకు సిద్ద పడతాడు. అందుకోసం మాలలు ఆర్డర్ బాలుకు ఇస్తాడు. వీరబాబు ఆర్డర్ ఇచ్చిన 5 వందల పూలల మాటలు తీసుకుని వెళ్లాడానికి ఓ పెద్ద ఆటో వస్తుంది. దానిలోకి బాలు, మీనా ఇద్దరూ పూల మాలను సద్ది జాగ్రత్తగా తీసుకుని వెళ్లమని డ్రైవర్‌కి చెప్పి పంపిస్తారు. అయితే అప్పటికే గుణ మనుషులు బాలు ఇంటికి సమీపంలో కాపుకాస్తారు. ఇక్కడ ఆటో బయలుదేరగానే.. మరో ఇద్దరు రౌడీలకు కాల్ చేసి బండి వస్తుంది రెడీగా ఉండండి అని అంటారు.
గుణ మనుషులు పూల ఆటోను ఫాలో అవుతారు. ఆటో నడుపుతున్న డ్రైవర్ చెవిలో బ్లూ టూత్ పెట్టుకుని గమ్యానికి వెళ్తూఉంటాడు. దారిలోనే ఆ ఇద్దరు రౌడీలు బండి మీద ఫాలో అవుతారు. కొంచెం దూరం వెళ్ళాక ఆటోను ఆపి వెనక టైర్ పంచర్ అయ్యిందని వెళ్లి చెప్తారు. బ్యాక్ టైర్ పంచర్ అయ్యింది చూసుకో’ అని చెప్పి ముందుకు వెళ్లిపోతారు. దాంతో ఆ ఆటో డ్రైవర్ ఆగి దిగి వెనుక టైర్ చూసేందుకు ఆటో వెనక్కి వెళ్తాడు. ఇక ఆ ఆటో డ్రైవర్‌తో అబద్దం చెప్పిన రౌడీ.. ఆటో దగ్గరకు వెళ్లి ఆటోతో సహా పూల మాలాలను ఎత్తుకొని వెళ్ళిపోతారు.
వెంటనే తేరుకున్న ఆటో డ్రైవర్ బాలుకు ఫోన్ చేసి చెప్తాడు. పక్కనే మీనా కూడా షాక్ అవుతూ వింటుంది. పక్కనే ఉన్న బాలు ఫ్రెండ్ అశోక్ కంగారుగా ఫోన్ తీసుకుని.. రేయ్ బాలు.. మాలలు లేకపోతే మన ప్రాణాలే పోతాయిరా అంటూ అరుస్తాడు. అక్కడితో ప్రోమో అయిపోయింది. ఆ తర్వాత బాలు నిజంగా మాలలు పూర్తి చేసాము.. అని ఫోటోలు పెడతారు. అశోక్ వాళ్లు టెన్షన్ పడుతుంటారు. వీరబాబు పోలీసుల సాయంతో ఆటోను ఎత్తుకొని వెళ్లిన వాళ్లను పట్టుకుంటారా..? లేదా గుణ గురించి శివకు తెలిసిపోతుందా..?
ఒకవేళ శివకు తెలిస్తే గుణను అడుగుతాడా? బాలు కచ్చితంగా ఆ రౌడీలను కొట్టి మాలలు సమయానికి అందిస్తాడు అని, బాలు ఆ గుణగాడి తాట తీస్తాడు. గుణ క్యారెక్టర్ గురించి గుణ ఎంత ప్రమాదకరమో అన్న విషయం గురించి శివ తెలుసుకుంటాడు. మరి అలా ఏదో ఒక రూపంలో విషయం శివకు తెలిస్తే మా అక్కా బావలకు వచ్చిన ఆర్డర్‌నే పోగొట్టాలని చూస్తావా..? అని దూరం అవుతాడా? ఏదేమైన సోమవారం ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి..