OTT Movie : సైకో లక్షణాలు కలిగిన అమ్మాయి దెయ్యంగా మారితే ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో చూపించారు. కాలేజీ లైఫ్‌లో సోషల్ మీడియాకు యూత్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ ఒక్క క్లిక్ తో అది జీవితాన్ని ఆనందంగానూ మార్చగలదు, నరకంగా కూడా మార్చగలదు. ఈ సినిమాలో లారా అనే ఒక పాపులర్ కాలేజీ అమ్మాయి 800 మంది ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో జోష్‌లో ఉంటుంది. కానీ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్సే లేని ఒక అమ్మాయి నుండి లారాకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. ఆతరువాత స్టోరీ మారిపోతుంది. క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
లారా వుడ్‌సన్ అనే అమ్మాయి కాలేజ్ లో హడావిడి ఎక్కువగా చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఫేస్‌బుక్‌లో 800 మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఆమె తన స్నేహితులు ఒలివియా, ఇసబెల్, గుస్తావో, బాయ్ ఫ్రెండ్ టైలర్ తో సంతోషమైన జీవితం గడుపుతూ ఉంటుంది. ఒక రోజు లారాకి తన క్లాస్‌మేట్ మెరీనా మిల్స్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. మెరీనాకు ఫేస్‌బుక్‌లో ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడంతో, ఆమె యానిమేషన్ పోస్ట్‌లు చూసిన లారా జాలితో రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మెరీనా అతిగా ప్రవర్తిస్తూ, లారా పోస్ట్‌లపై నిరంతరం కామెంట్స్ పెడుతూ ఉంటుంది. ఇది లారాకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఒక రోజు మెరీనా తన బర్త్‌డే పార్టీకి లారాని ఆహ్వానిస్తుంది. లారా ఆ పార్టీకి వెళ్ళకుండా ఒక తప్పుడు కారణం చెప్పి, ఆమెను ఫేస్‌బుక్‌లో ఆన్ ఫాలో చేస్తుంది. ఈ నిర్ణయం భయంకర పరిణామాలకు దారితీస్తుంది.
ఆ తరువాత మెరీనా తనని కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ వీడియో లారా ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ అవుతుంది. కానీ లారా దాన్ని డిలీట్ చేయలేకపోతుంది. ఆమె అకౌంట్‌ను డియాక్టివేట్ చేయడం కూడా అసాధ్యమవుతుంది. ఆమె ఫ్రెండ్ కౌంట్ కూడా వేగంగా తగ్గడం మొదలవుతుంది. మెరీనా ఆత్మ సోషల్ మీడియాలో ఉన్న లారా స్నేహితులను ఒక్కొక్కరినీ భయంకరమైన రీతిలో హత్య చేస్తుంది. వీటిని ఆపడానికి లారా తన బాయ్ ఫ్రెండ్ టైలర్ తో కలసి, మెరీనా ల్యాప్‌టాప్‌ను నాశనం చేయడానికి ఆమె ఇంటికి వెళ్తుంది. చివరికి లారా మెరినా ల్యాప్‌టాప్ ను ధ్వంసం చేస్తుందా ? మెరినా చేతిలో లారా ఏమౌతుంది ? మెరినా ఇంకెంతమందిని చంపుతుంది ? లారా, మెరినాను ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ హర్రర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిలను ఏంజెల్ రూపంలో చంపే సైకో… పోలీసులకే చుక్కలు చూపించే క్రైమ్ కథా చిత్రమ్
ఈ సైకలాజికల్ హర్రర్ సినిమా పేరు ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ (Friend Request). 2016 లో వచ్చిన ఈ సినిమాకు సైమన్ వెర్‌హోవెన్ దర్శకత్వం వహించారు. ఇందులో అలీసియా డెబ్‌నమ్-కేరీ (లారా), లీస్ల్ అహ్లెర్స్ (మెరీనా), విలియం మోస్లీ (టైలర్), కానర్ పావోలో (కోబీ), బ్రిట్ మోర్గాన్ (ఒలివియా), బ్రూక్ మార్క్‌హామ్ (ఇసబెల్) వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. 92 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాకి IMDbలో 5.2/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టివి (Apple TV) లలో ఈ మూవీ అందుబాటులో ఉంది.