OTT Movie : ప్రపంచం అంతానికి దారి తీసే స్టోరీలతో చాలా సినిమాలు వచ్చాయి. 2012లోనే ప్రపంచం అంతమైపోతుందని సినిమాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కరోనా లాంటి విపత్తులు వచ్చాయి. ఇటువంటి ఒక మారణ హోమంతో 2023లో ఒక హాలీవుడ్ మూవీ తెరకెక్కింది. సైబర్ అటాక్ తో టెర్రరిస్టులు ఒక దేశాన్ని నాశనం చేయాలనుకునే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లీవ్ ది వరల్డ్ బిహైండ్‘ (Leave the world behind). 2023లో విడుదలైన ఈ అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి సామ్ ఎస్మాయిల్ దర్శకత్వం వహించారు. ఇది రుమాన్ ఆలం రాసిన 2020 నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ మూవీలో జూలియా రాబర్ట్స్, మహర్షలా అలీ, ఈతాన్ హాక్, మైహాలా నటించారు. ఈ మూవీ రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. వారు ఫోన్‌లు, టెలివిజన్, ఇతర సాంకేతికత వేగంగా విచ్ఛిన్నం కావడాన్ని తెలుసుకుంటారు. ఒక భయంకరమైన విపత్తును కళ్ళారా చూస్తారు. ఈ మూవీ డిసెంబర్ 8, 2023 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో, హీరోయిన్లు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఒక వెకేషన్ కి వెళ్తారు. ఆ ప్రాంతంలో ఈ కుటుంబం బీచ్ లో సేద తీరుతుండగా, అనుకోకుండా ఒక పెద్ద షిప్ ఆ ప్రాంతాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని బయటకి పంపించి వేస్తారు అధికారులు. హోటల్ రూమ్ కి వచ్చిన వీళ్ళు రెస్ట్ తీసుకుంటుండగా, రూట్, స్కాట్ అనే ఒక జంట వీళ్ళ దగ్గరికి వస్తారు. ఈ హోటల్ మాదే అని, బయట చాలా అలజడిగా ఉంది ఈరోజు ఇక్కడ స్టే చేస్తామని చెప్తారు. హీరోయిన్ వీళ్ళపై అనుమానం పెంచుకుంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి డబ్బు కూడా ఆఫర్ చేస్తారు. ఐడి కార్డు కూడా తేకపోవడంతో అనుమానంతోనే అక్కడ ఉండమంటారు. అయితే పొద్దున లేచిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ తో పాటు ఏవి పనిచేయకుండా పోతాయి. చుట్టుపక్కల కూడా మనుషులనే వాళ్ళు ఎవరూ కనిపించకుండా పోతారు. అసలు ఏం జరుగుతుందో చూడాలని హీరో బయటకు వెళ్తాడు. బయట హైవేలో కార్లన్నీ నిండిపోయి ఉంటాయి. అందులో మనుషులు మాత్రం ఉండరు.
ఒకపక్క విమానాలు కూలిపోయి కుప్పలు తెప్పలుగా మనుషులు చనిపోయి ఉంటారు. మళ్లీ గెస్ట్ హౌస్ కి వచ్చిన హీరో ఇప్పుడు బయటకి వెళ్లలేమని చెప్తాడు. అయితే ఇది మైక్రో వెపన్స్ చేసే దాడులని, మూడు రకాలుగా టార్గెట్ చేసిన దేశం నాశనం అవుతుందని రూట్, హీరో ఫ్యామిలీకి చెప్తాడు. ఎందుకంటే అతను కూడా ఒక మిలిటరీ ఉద్యోగి కావడంతో ఈ విషయాలు తెలుసుకుంటాడు. ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి బయటపడడం చాలా కష్టమని చెప్తాడు. ఇంతలో హీరో కొడుక్కి ఉన్నట్టుండి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అతని అనారోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. రేడియో సిగ్నల్స్ ద్వారా మనుషులకు, జంతువులకు కూడా ప్రమాదాలు జరగవచ్చు అని చెబుతాడు రూట్. చివరికి హీరో కుటుంబం అక్కడ నుంచి బయటపడగలుగుతుందా? ఈ ఎటాక్ వల్ల హీరో కుటుంబం ఇంకా ఎటువంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది? రూట్ వీరికి ఏ విధంగా సాయం చేస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.