IND vs ENG 2nd T20: టీమిండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) మధ్య ఇవాళ రెండవ టి20 ( IND vs ENG 2nd T20) ప్రారంభం కానుంది. ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా… రెండవ మ్యాచ్ లోను గెలిచి.. లీడింగ్ కొనసాగించాలని భావిస్తుంది సూర్య కుమార్ సేన. రికార్డు ఈడెన్ గార్డెన్స్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్… ఇవాళ రెండో టెస్టుకు సన్నద్ధమైంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండవ టెస్ట్ చెన్నైలోని ( Chennai ) చిన్నస్వామి స్టేడియంలో ( Chinnaswamy Stadium ) జరగబోతుంది.
Also Read: Indian Cricketer Relative: టీమిండియాలో విషాదం.. పులి దాడిలో ఆమె మృతి ?
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం… రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆరున్నర గంటలకు టాస్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇవాల్టి మ్యాచ్ లో మొదటి టి20 హీరో అభిషేక్ శర్మ దూరం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అతని కాలికి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. మొదటి టి20 మ్యాచ్ లో దుమ్ము లేపిన అభిషేక్ శర్మ ( Abhishek Sharma )… యాంకిల్ నొప్పితో బాధపడుతున్నాడట. దీంతో ఇవాల్టి మ్యాచ్లో అతను ఆడే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
ఒక వేళ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ జరిగే రెండవ టి20లో ఆడకపోతే… సంజూ శాంసన్ అలాగే తిలక్ వర్మ ఓపెనింగ్ చేస్తారు. అభిషేక్ శర్మ స్థానంలో దృవ్ జురేల్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. లేకపోతే వాషింగ్ టన్ సుందర్ తుది జట్టులో ఉంటాడు. ఇది ఇలా ఉండగా.. మొదటి టీ 20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) 79 పరుగులు చేసి.. టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.
Also Read: ICC ODI Team of Year: టీమిండియాకు అవమానం.. ICC ODI జట్టులో ఒక్కడూ లేడు ?
ఫ్రీగా చూడాలంటే ?
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ జరిగే రెండవ టి20 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్ 1 (HD & SD), స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ (HD & SD), స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం (HD & SD), స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు (HD & SD), మరియు స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ (SD)లో ప్రసారం కానుంది. ఇక టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ జరిగే రెండవ టి20 డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం ఉచితంగా చూడొచ్చు.
టీమిండియా:
అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) , సంజు శాంసన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్:
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(w), జోస్ బట్లర్(c), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
🚨 ABHISHEK SHARMA DOUBTFUL FOR 2ND T20I 🚨
– Abhishek Sharma’s availablity for 2nd T20I Match vs England in doubtful. He twisted his right ankle in today’s practice session. (Express Sports). pic.twitter.com/FljFokKScC
— Tanuj Singh (@ImTanujSingh) January 24, 2025