BigTV English

Mahesh Babu – Priyanka Chopra: మహేష్ బాబు మూవీ షూటింగ్ స్టార్ట్.. ప్రియాంక చోప్రా కన్ఫామ్..

Mahesh Babu – Priyanka Chopra: మహేష్ బాబు మూవీ షూటింగ్ స్టార్ట్.. ప్రియాంక చోప్రా కన్ఫామ్..

Mahesh Babu – Priyanka Chopra: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. జక్కన్న సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఆలోచనతో వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. SSMB29 షూటింగ్ కి సంబందించిన అప్డేట్ ను స్వయంగా రాజమౌలే ఇచ్చాడు.. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హీరో మహేష్ బాబుని లాక్ చేసానని.. పాస్ పోస్ట్ చూపిస్తూ ఫోటోకి ఫోజిచ్చాడు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అలాగే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ప్రియాంక చోప్రా ఒప్పుకోవడం హైలెట్ విషయం..


ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ప్రియాంక చోప్రా లుక్ టెస్ట్ పూర్తయిన తర్వాత షూటింగ్ డేట్స్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న తెరకేక్కించబోతున్నాడు. సౌతాఫ్రికా అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం.. రాజమౌళి సినిమాలో హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వాలంటే కాస్త ఆలోచిస్తారు కానీ ప్రియాంక చోప్రా మాత్రం అసలు ఆలోచించకుండా రాజమౌళి అడిగిన డేట్స్ కు ఓకే చెప్పేసిందని తెలిసిందే.. ఇక మహేష్ బాబు రాజమౌళి పోస్ట్ కు రిప్లై ఇచ్చాడు. మహేష్ బాబు ఈ సినిమా గురించి చెబుతూ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని ట్వీట్ చేశారు. దానికి ప్రియాంక చోప్రా ఫైనల్లీ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటికే రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టిన రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించినట్లు తెలిసింది. ఇందుకోసం హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్‌ను తీర్చిదిద్దారు.. ఇక త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ ను పూర్తి చేసి త్వరగా థియేటర్లోకి తీసుకురావాలని ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు సమాచారం.. ఈ మూవీ ని అమెజాన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్నందిస్తుండగా, దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు.. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి ఊరిస్తూ వస్తున్న జక్కన్న ఫైనల్ ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడం తో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. త్వరలోనే తమ హీరోను ఫ్యాన్ ఇండియా లెవెల్లో చూడవచ్చునని మురిసిపోతున్నారు. ఈ మూవి నుంచి మరికొద్ది రోజుల్లోనే కీలకమైన అప్డేట్ను రాజమౌళి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవడంతో కొత్త సందడి మొదలైంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×