BigTV English

OTT Movie : దైవానికే ఎదురు తిరిగే దైవ దూత… అక్కడ మనుషుల అంతం ఆరంభం

OTT Movie : దైవానికే ఎదురు తిరిగే దైవ దూత… అక్కడ మనుషుల అంతం ఆరంభం

OTT Movie : మనుషులు దేవుడికి భయపడతారో లేదో గాని, దయ్యాలకు మాత్రం బాగా భయపడతారు. సినిమాలలో వచ్చే దయ్యాలకే వణికి పోతూ ఉంటారు. రియల్ గా వస్తే ఏమవుతారో మరి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మనుషుల మీద కోపంతో, ప్రపంచాన్ని అంతం చేయాలనుకుంటాడు దేవుడు. ఈ క్రమంలోనే మనుషులకు సైతాన్ ఆవహించి ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటారు. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఎంఎక్స్ ప్లేయర్ (MX player) లో

ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లెజియన్’ (Legion). ఈ యాక్షన్ హారర్ మూవీకి స్కాట్ స్టీవర్ట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాల్ బెట్టనీ, లూకాస్ బ్లాక్, టైరీస్ గిబ్సన్, అడ్రియన్ పాలికి, కేట్ వాల్ష్ నటించారు. లెజియన్ ఒక శిశువుని దేవదూతల నుండి, అపోకలిప్స్‌లో ఉన్నవారి నుండి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఈ మూవీ $26 మిలియన్ల బడ్జెట్‌లో తెరకెక్కగా, $67 మిలియన్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్ (MX player) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

మైకేల్ అనే వ్యక్తి ఆకాశంలో నుంచి భూమి మీదకి రెక్కల రూపంలో వస్తాడు. ఆ తర్వాత ఆ రెక్కలను కత్తిరించి, ఒక షాప్ లో ఉండే పేలుడు సామాన్లు, తుపాకులను తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఒక ఫ్యామిలీ హోటల్ రన్ చేస్తూ ఉంటుంది. అందులో హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అక్కడికి ఒక ముసలామె వచ్చి, కొద్ది రోజుల్లో అందరూ చచ్చిపోతారని చెప్తుంది. హీరోయిన్ కడుపులో పెరిగే బిడ్డ కూడా చచ్చిపోతాడని చెప్పడంతో, అక్కడున్న వాళ్ళు ఆమెపై కోప్పడతారు. అప్పుడు ఆ ముసలామే దయ్యం ఆవహించినట్టు ప్రవర్తిస్తుంది. మనుషులపై ఎగబడి చంపడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు గన్ తీసుకొని షూట్ చేసి చంపేస్తారు. మైఖేల్ వీళ్ళు ఉన్న చోటికి వచ్చి, వాళ్లందరికీ గన్స్ ఇస్తాడు. వాళ్ళందరూ ఎందుకు ఇవన్నీ ఇస్తున్నావని అడుగుతారు. తాను దైవదూత అని వాళ్ళందరికీ పరిచయం చేసుకుంటాడు.

దేవుడు మనుషులను అంతం చేయాలని చూస్తున్నాడని, అయితే నేను మీ అందరినీ కాపాడటానికి రాలేదని కూడా చెప్తాడు. హీరోయిన్ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమే వచ్చానని చెప్తాడు. ఆ బిడ్డ ప్రపంచాన్ని కాపాడే వ్యక్తని, అందుకోసమే ఇక్కడికి వచ్చాను చెప్పడంతో వాళ్లంతా ఆశ్చర్యపోతారు. అన్నట్టుగానే అక్కడికి చాలామంది సైతాన్ ఆవహించిన మనుషులు వీళ్ళ దగ్గరికి వస్తారు. వీళ్ళు వాళ్ళందర్ని షూట్ చేసి చంపేస్తూ ఉంటారు. చివరికి మైకేల్ హీరోయిన్ కడుపులో ఉన్న బిడ్డని కాపాడతాడా? దేవుడు ఎందుకు మనుషుల్ని అంతం చేయాలనుకుంటాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్ (MX player) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లెజియన్’ (Legion) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×