BigTV English

Thandel Collections :  బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కలెక్షన్ల మోత మోగిపోతుంది..

Thandel Collections :  బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కలెక్షన్ల మోత మోగిపోతుంది..

Thandel Collections : టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హిట్ ఖాతా ఓపెన్ అయ్యింది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీలో నటించాడు. ఆ మూవీ ఈ నెలలో రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో పాటుగా కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. మూవీ రిలీజ్ పది రోజులు అవుతున్నా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాగ చైతన్య ఆమె ముందు తేలిపోయాడు.. ఇక ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒక్కసారి మనం తెలుసుకుందాం..


నాగ చైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్.. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘తండేల్ ‘ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్రేమ కోసం బ్రతికే జంట లవ్ స్టోరీతో పాటుగా దేశభక్తి ని కూడా యాడ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు హైలెట్ అయ్యాయి.. దాంతో ఈ మూవీ తొలి రోజు నుంచి 6 రోజుల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.. థియేటర్లలోకి వచ్చిన 5 రోజులకే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం మామూలు విషయం కాదు.. తొమ్మిది రోజులకు ఎన్ని కోట్లు రాబట్టిందో చూడాలి..

సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే జాలర్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీగా తీసుకున్నారు. ముఖ్యంగా  శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో కూడిన స్టోరీ లైన్ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. చందూ మొండేటి, నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి..


తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించింది.. అదే జోరు రెండో రోజు కూడా కొనసాగింది. రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ. 22 కోట్లు. ఇక నాలుగవ రోజు రూ. 10 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 5 డే రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే 80 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఎనిమిది రోజులకు 90 కోట్లకు పైగా వసూల్ చేసింది. 98 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. అంతకు మించి వసూల్ చేసిందేమో తెలియాల్సి ఉంది. ఏది ఏమైన నాగ చైతన్య ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్ పడింది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×