Nindu Noorella Saavasam Serial Today Episode : ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పిల్లలకు కేర్ టేకర్‌గా పెడదామని చెప్తాడు అమర్. సరే అంటుంది మిస్సమ్మ. ఇంతలో మిస్సమ్మ ఏవండి అంటూ ఏదో చెప్పడానికి నసుగుతుంటే.. ఏవండి చెప్పండి అంటాడు. దీంతో మిస్సమ్మ, అమర్‌కు హగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు పేపర్ లో కేర్ టేకర్ జాబ్ చూసి చేయాలనుకుంటుంది అనామిక. వాళ్ల అన్నయ్య వచ్చి ఆ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చావా అని అడుగుతాడు. ఇదే చేయాలని ఏం రాలేదు అంటుంది అనామిక. మరోవైపు కాళీ ముసుగు వేసుకుని రణవీర్ ఇంటికి వెళ్తాడు. గోడ దూకి లోపలికి వెళ్లి రణవీర్‌ను చూసి కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో పూలకుండీ కిందపడటంతో రణవీర్ నిద్ర లేస్తాడు. కాళీని చూసి షాక్ అవుతాడు. రేయ్ ఎవడ్రా నువ్వు అంటూ పట్టుకోబోతాడు. కాళీ, రణవీర్‌ను కత్తితో పొడిచి పారిపోతాడు. ఇంతలో రణవీర్ మనుషులు వచ్చి రణవీర్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు.
కాళీ ఫోన్ కోసం మనోహరి ఎదురు చూస్తుంది. ఈ కాళీ గాడు ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు. ఆ రణవీర్‌ను చంపాడో.. రణవీర్ చేతిలో చచ్చాడో తెలియడం లేదే..? అని అనుకుంటుండగా కాళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన మనోహరి హలో ఎక్కడ చచ్చావు ఇంత సేపు ఆ రణవీర్‌ను చంపేశావా..? వాడు చనిపోయాడా..? అని అడుగుతుంది. కాళీ లేదని.. వాడిని పొడిచాను. కానీ చావలేదు చచ్చేదాకా పొడవాలని చూస్తే వాడి మనుషులు వచ్చారు. ఏం చేయాలో తెలియక తప్పించుకుని వచ్చేశా అని చెప్తాడు. దీంతో మనోహరి కోపంతో ఒరేయ్ ఇడియట్ నువ్వు ఏం చేశావో నీకు అర్థం అవుతుందా..? రణవీర్‌ను పొడిచింది నువ్వే అని తెలిస్తే ఏమవుతుందో తెలుసా..? అంటుంది.
ఎట్లా తెలుస్తుంది. నా ముఖానికి మాస్క్ వేసుకుని పోయిన అంటాడు కాళీ. చంపింది నువ్వే అని తెలియకపోయినా చంపడానికి ప్రయత్నించింది నేనే కచ్చితంగా కనిపెట్టేస్తాడు అంటూ భయపడుతుంది మనోహరి. దీంతో కాళీ ఏం ఎందుకు అంత భయపడతావు అంటాడు. వాడు అనుమానంతో ఇప్పుడు నాకు ఫోన్ చేసినా చేస్తాడు. అని చెప్తుండగానే రణవీర్, మనోహరికి ఫోన్ చేస్తాడు. దీంతో మనోహరి భయంతో రణవీర్ నాకు ఫోన్ చేస్తున్నాడు. వాడికి అనుమానం వచ్చినట్టు ఉంది అంటుంది మనోహరి. దీంతో ఎట్లా ఇప్పుడు ఏం చేద్దా అని అడుగుతాడు కాళీ. ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఎక్కడికైనా దూరంగా పారిపో అని చెప్తుంది మనోహరి.. వెంటనే రణవీర్ కాల్ లిఫ్ట్ చేస్తుంది.
రణవీర్ బాధతో ఏంటి మనోహరి నా చావు కబురు కోసం ఎదురు చూసిన నువ్వు.. నేను చావలేదని నీ మనిషి ఫోన్ చేసి చెప్పగానే.. బాగా డిస్సపాయింట్ అయినట్టు ఉన్నావు కదూ అంటాడు. దీంతో మనోహరి, రణవీర్ నీకేం కాలేదు కదా..? నీ మీద ఎవరో కత్తితో అటాక్ చేశారంట కదా..? అతనెవరో ఇందాక ఫోన్ చేసి నీ మొగుడి మీద అటాక్ చేశాను. టైం బాగుండి తప్పించుకున్నాడు నెక్ట్స్ నువ్వే పైకి వెళ్లడానికి రెడీగా ఉండు అంటూ ఫోన్ చేశాడు. ఇప్పుడు ఫోన్ మాట్లాడింది అతనితోనే అంటుంది. దీంతో నేను ఇదంతా నమ్మొచ్చా అని అడుగుతాడు రణవీర్. నేనేం మాట్లాడుతున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావు అంటుంది మనోహరి. దీంతో రణవీర్ నమ్మొచ్చా అని అడుగుతాడు. మనోహరి షాకింగ్‌గా ఫోన్ కట్ చేస్తుంది.
మరుసటి రోజు ఉదయం ఇంటిముందు ముగ్గు వేస్తూ కూర్చున్న మిస్సమ్మ సిగ్గు పడుతూ ముగ్గు వేయకుండా ఊహాల్లో తేలిపోతుంది. అమర్ రాత్రి మాట్లాడిన మాటలే గుర్తు చేసుకుంటుంది. నిర్మల వచ్చి పిలిచినా పలకదు సిగ్గుతో వంకలు తిరగుతూనే ఉంటుంది. ఇంతలో రాథోడ్ వచ్చి ఏంటి మేడం ఇంత నీరసంగా నిలబడ్డారు అని అడుగుతాడు. నిర్మల మిస్సమ్మను చూపించి.. ఇప్పటికి వంద సార్లు పిలిచాను ఉలుకు లేదు పలుకు లేదు అంటుంది. అంత పరధ్యానంగా ఎందుకు ఉంది. ఏం జరిగి ఉంటుంది అంటాడు రాథోడ్. ఇంతలో శివరాం వచ్చి ఏంటి మిస్సమ్మ ఇంకా ఇక్కడే ఉందా..? అంటాడు. రాథోడ్ షాకింగ్‌గా ఎప్పటి నుంచి అలా ఉంది అని అడుగుతాడు. గంట నుంచి అలాగే ఉందని నిర్మల చెప్తుంది. రాథోడ్ దగ్గరకు వెళ్లి మిస్సమ్మను తట్టి గట్టిగా అరుస్తాడు.
తర్వాత రాథోడ్ పిల్లల దగ్గరకు వెళ్లి మీ పనులన్నీ చూసుకోవడానికి ఒక కేర్‌టేకర్ వస్తున్నాడు అని చెప్తాడు. దీంతో అంజు నీరసంగా ఏంటి మళ్లీ ఇంకో కేర్‌టేకరా అంటుంది. అమ్ము మాత్రం ఎవరు రాథోడ్ ఆ కేర్ టేకర్ అని అడుగుతుంది. నాకు తెలియదు అని రాథోడ్ చెప్తాడు. అంజు మాత్రం ఆ మిస్సమ్మ నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తాను అంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?