OTT Movie : ఒకప్పుడు అలాంటి సన్నివేశాలు మన సినిమాలలో వేరే రకంగా ఉండేవి. ఆటలు, పాటలతోనే ఈ సన్నివేశాలు పండించే వాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. కొన్ని సినిమాలంటే శరీరాన్ని తప్పకుండా చూపించాల్సిందే. స్మార్ట్ ఫోన్ వాడకం వచ్చాక ఇది ఇంకా ఎక్కువగా ఉంటోంది. అయితే 1957 లో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీలో అలాంటి సీన్స్ ఎలా ఉండేవో ఇప్పుడు చూద్దాం. ఈ హాలీవుడ్ లో వచ్చిన పిల్లలు చూడలేని మూవీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
యూట్యూబ్ (YouTube)
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘లవ్ స్లేవ్స్ ఆఫ్ ది అమెజాన్‘ (Love Slaves of the Amazon). ఈ మూవీలో అమెజాన్ అడవుల్లో రీసెర్చ్ చేసే హీరో, అక్కడ అమ్మాయిలు మాత్రమే ఉండే ఒక తెగకు బందీ అవుతాడు. అక్కడున్న అమ్మాయిలు ప్రెగ్నెంట్ చేయమని ఇతని వెనకాల పడతారు. ఈ మూవీ యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో పురాతన వస్తువులను వెలికితీసి కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అమెజాన్ అడవిలో ఒక ప్రాంతంలో వీటి కోసం వెతుకుతూ ఉంటాడు హీరో. అక్కడ సముద్రపు దొంగల చేతిలో వీళ్ళ బృందం చనిపోతుంది. హీరో అక్కడి నుంచి తృటిలో తప్పించుకొని, అమ్మాయిలు మాత్రమే ఉండే ఒక తెగకు చిక్కుతాడు. ఆ ప్రాంతంలో హీరోతో ఏకాంతంగా గడపడానికి అక్కడ ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు. అయితే వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు హీరో. ఎందుకంటే వాళ్ళల్లో ముసలి వాళ్ళు కూడా ఆ పని చేయమని అడుగుతుంటారు. అక్కడున్న ఒక అమ్మాయిని హీరో ఇష్టపడతాడు. అయితే ఒకసారి రాణి దగ్గరికి ఇతన్ని తీసుకువస్తారు. ఆమె అందాన్ని చూసి హీరోకి కూడా మతి పోతుంది. మొదట రాణి కూడా ఇతనితో గడపాలనుకుంటుంది. ఆ ప్రాంతంలో ఆడవాళ్ళు ఒక వ్యక్తి ద్వారానే పిల్లల్ని కంటారు. ఇంతకుముందు వీళ్ళ చేతికి చిక్కిన ఒక వ్యక్తి హీరోకి పరిచయం అవుతాడు. అతనికి వయసు అయిపోతూ ఉంటుంది.
అక్కడున్న చాలామంది అమ్మాయిలు ఇతనికే పుట్టి ఉంటారు. మగ బిడ్డని కంటే చంపేస్తూ ఉంటారు ఈ తెగవాళ్ళు. హీరో ఇక ఆపని కోసం రంగ ప్రవేశం చేయాల్సి వస్తుంది. ఒక అమ్మాయి ఆ పని చేయకపోతే హీరోని చంపేస్తానని బెదిరిస్తుంది. ఇస్టం లేకపోయినా ఆ అమ్మాయితో ఆ పని చేయబోతుండగా, ఆ ప్రాంతంలోకి వేరే తెగవాళ్ళు యుద్ధానికి వస్తారు. హీరో అక్కడే ఉన్న ఒకమ్మాయిని ప్రేమిస్తుండటంతో, ఆమెతో కలసి అక్కడినుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. చివరికి హీరో అక్కడి నుంచి బయటపడతాడా? యుద్ధంలో ఈ అమ్మాయిలు ఏమవుతారు? హీరో అక్కడ ఉన్న అమ్మాయిలను ఏమైనా చేశాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘లవ్ స్లేవ్స్ ఆఫ్ ది అమెజాన్’ (love slaves of the Amazon) హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీని చూడాల్సిందే.