Brahmamudi serial today Episode: రాజ్, కావ్య ఇంటికి రాగానే రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ చిలకా గోరింకల్లా రాత్రంతా ఊరేగి వచ్చారా..? అంటుంది. భార్యాభర్తలమేగా తిరిగితే ఏమైంది అని కావ్య అడుగుతుంది. అసలు మీరు ఎక్కడైనా తిరగండి కానీ ఇంట్లో ఒక్క కారు కూడా లేకుండా పంపిచేశావు ఎందుకు అని ధాన్యక్ష్మీ అడుగుతుంది. కార్లు పంపించడానికి నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలి. చెప్పండి నా భర్త పక్కనే ఉన్నాడు.. ఆయనకు తెలిసే కార్లు పంపించాను అంటుంది కావ్య. అసలు నీకు ఎంత పొగరు ఎవరిని అడగాలని ఎదురు ప్రశ్న వేస్తావేంటి..? నీకు కార్లు వద్దని చెప్పే అధికారం ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది.
అన్ని హక్కులు నాకు తాతయ్యగారు ఇచ్చారు అని కావ్య చెప్తుంది. దీంతో రుద్రాణి కోపంగా ఏంటి ఓకే రకం కూర పెట్టమని.. ఓకే రకం కూర పెట్టమని ఖర్చులు తగ్గించమని మా నాన్న ఏమైనా ఆ డాక్యుమెంటులో రాసి ఇచ్చాడా..? అని అడుగుతుంది. లేదని కానీ మీరు ఇష్టమొచ్చినట్టు లక్షలకు లక్షలు ఖర్చు పెడితే అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు. నన్నే కదా..? ఈ ఆస్తి మొత్తం బాధ్యతగా కాపాడమని తాతయ్యగారు నాకు బాధ్యత ఇచ్చారు అంటుంది. దీంతో నువ్వు పెట్టే రూల్స్ వల్లా ఈ ఇంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నారు అంటూ రుద్రాణి అనగానే.. నేను ఇంత సేపు చెప్పింది జవాబు మాత్రమే అంటూ పైకి వెళ్లిపోతుంది. ప్రకాష్ కూడా అన్నయ్య ఇప్పటి వరకు ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు కావ్య మాట్లాడిన పద్దతి మాత్రం నాకు నచ్చలేదు అంటూ వెళ్లిపోతాడు.
రూంలోకి వెళ్లిన రాజ్ డల్లుగా కూర్చుంటే.. ఏమైందండి అలా కూర్చున్నారు అని కావ్య అడుగుతుంది. నా ప్రవర్తన మీకు బాధ కలిగించిందా..? అని అడగ్గానే.. అవును నువ్వు అంత కఠినంగా ప్రవర్తించకూడదు అంటాడు. దీంతో జబ్బు చేసిన రోగికి వైద్యం చేసే డాక్టర్ చెడ్డవాడా..? ఈ ఇంటికి జబ్బు చేసిందండి.. ఈ ఆస్తికి మహమ్మారి సోకింది. తెగులు పట్టిన పంటమీద మందు చల్లే విధానం ఇది. ఇప్పుడున్న పరిస్తితుల్లో నేను వాళ్లకు నచ్చేలా ఉండాలంటే కుదరదు.
తాతయ్య హాస్పిటల్ బిల్లు కట్టడానికి మీరు పడ్డ కష్టం నేను మర్చిపోలేను అంటుంది కావ్య. దీని వల్ల పరిణామాలు ఎలా ఉంటాయో కదా అంటాడు రాజ్. ఇది ఒక మంచికే మీరు ప్రశాంతంగా ఉండండి అంటుంది కావ్య. కానీ మీరు కుటుంబానికి దూరం అయ్యే పరిస్తితి ఏర్పడుతుంది అని రాజ్ అనగానే.. వాళ్లకు నిజం చెప్పాలంటే జరిగింది మొత్తం చెప్పాలి. అలా చెబితే వాళ్లు తట్టుకోలేరు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది వాళ్ల గురించి కాదు. చేయాల్సిన పనుల గురించి అని చెప్తుంది కావ్య.
ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ గార్డెన్‌లో కూర్చుని కావ్య మాటల గురించి ఆలోచిస్తుంటారు. కావ్య ప్రవర్తన వల్ల రుద్రాణి, ధాన్యలక్ష్మీలకు మరింత చాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అనగానే కావ్య బాధ్యతలు సక్రమంగానే నిర్వహిస్తుందని.. కానీ కొన్ని విషయాలు మరీ కఠినంగా ఉంటుంది అంటాడు. అసలే అవకాశం ఎప్పుడు దొరుకుందోనని ఎదురు చూస్తున్నారు. వాళ్లు ప్రకాష్‌ను కూడా చెడగొడుతున్నారు. ఇదే జరిగితే ప్రకాష్ కూడా మనకు దూరం అవుతాడమ్మా అంటాడు సుభాష్. ప్రకాష్ అలాంటి వాడు కాదు.. అన్ని తెలుసుకుని అర్తం చేసుకుంటాడు అని అపర్ణ చెప్తుంది.
నంద చెంప పగులగొడుతుంది అనామిక. నంద సారీ చెప్తాడు. నీ సారీ ఎవడికి కావాలిరా.. ఆరు నెలలు నేను ఎంతో ప్లాన్ చేసి వంద కోట్ల ఆస్తి నీకు వచ్చేలా చేస్తాను మూడు నెలలు ఆజ్ఞాతంలో ఉండమని చెబితే నీకు అక్కడ కూడా అమ్మాయి కావాల్సి వచ్చిందా..? అంటూ తిడుతుంది. చూడు నేను చెప్పింది చేయకపోతే నేనే పోలీసులకు చెప్పి నిన్ను జైలుకు పంపిస్తాను అంటూ బెదిరిస్తుంది.
దీంతో వద్దు మేడం మీరు ఆ పని మాత్రం చేయకండి నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను అంటాడు నంద. అలాంటప్పుడు మేము చెప్పిన పనులు మాత్రమే చేయాలి. సొంత తెలివి తేటలు వాడితే ఇలాగే ఉంటుంది అంటాడు సామంత్. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను అంటాడు నంద. అలా జరిగితే మాత్రం ఈ సారి నువ్వు ప్రాణాలతో ఉండవు అంటూ వార్నింగ్ ఇస్తుంది అనామిక.
కావ్య రెడీ అయి ఆఫీసుకు వెళ్తుంటే.. టిఫిన్ రెడీ అయిందని శాంత చెప్పగానే.. టైం లేదు శాంత ఆఫీసుకు వెళ్తున్నాను అంటూ వెళ్లబోతుంటే.. అపర్ణ కూడా టిఫిన్ చేయమని పిలుస్తుంది. అస్సలు టైం లేదు అత్తయ్యా అర్జెంట్ గా ఆఫీసుకు వెళ్లాలి అని వెళ్లిపోతుంది. రాజ్ కూడా వెళ్తుంటే సుభాష్ పిలుస్తాడు. నీతో మాట్లాడాలి అని అడగ్గానే ఇప్పుడు టైం లేదు డాడ్ అంటూ రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత రాత్రికి కూడా అందరూ భోజనాల దగ్గర కూర్చుని ఉండగా రాజ్, కావ్య వస్తారు. భోజనం చేద్దురు ఫ్రెష్ అయి రండి అని చెప్పగానే..లేదని చెప్పి ఇద్దరూ పైకి వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?