Manamey OTT Release Date : గత కొంతకాలంగా హిట్ కోసం సతమతం అవుతున్న యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand). రిజల్ట్ తో సంబంధం లేకుండా సరికొత్త కథలను ఎంచుకుంటూ, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ (Manamey) మూవీ దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతోంది. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో, ఎప్పుడు చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో….
శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీలో రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. హేశమ్ అబ్దుల్ వాహద్ మూవీకి సంగీతం అందించారు. గత ఏడాది జూన్ 7న థియేటర్లకు వచ్చిన ఈ మూవీ… ఎప్పుడు, వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా ప్రేక్షకులకు తెలియలేదు. ఈ నేపథ్యంలోనే ‘మనమే’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు కు దాదాపు ఏడాది తర్వాత ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది.
సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత కూడా ఓటీటీ డీల్స్ సెట్ కాకపోవడంతో ఇప్పటిదాకా డిజిటల్ స్ట్రిమింగ్ కు నోచుకోలేదు ఈ మూవీ. కానీ తాజాగా ‘మనమే’ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈనెల 9 నుంచి ‘మనమే’ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
కథ
విక్రమ్ బాధ్యత లేని యువకుడు. చీకూ చింతా లేకుండా సరదాగా జీవితాన్ని గడుపుతాడు. అతని ప్రాణ స్నేహితుడు అనురాగ్. అనురాగ్ అతని భార్య ఇద్దరూ ఓ ప్రమాదంలో చనిపోవడంతో వారి కొడుకు ఖుషీని విక్రమ్ తో పాటు సుభద్ర కలిసి పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖుషీ కోసం ఇద్దరూ పెళ్లి కాకుండానే పేరెంట్స్ అవుతారు. అయితే వీరిద్దరూ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటారు. సుభద్ర అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ విక్రమ్ కు మాత్రం అస్సలు బాధ్యత ఉండదు. అలాంటి వీరిద్దరూ కలిసి పిల్లాడిని పెంచడంలో బాధ్యత తీసుకుంటే ఏం జరిగింది? జోసెఫ్, కార్తీక్ పాత్రలేంటి? ఖుషి సుభద్ర, విక్రమ్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి? అసలు సుభద్ర, విక్రమ్ ఎలా కలుసుకున్నారు? అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే.
ఇదిలా ఉండగా శర్వానంద్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారి నారి నడుమ మురారి’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇది బాలయ్య హిట్ మూవీ టైటిల్ కావడంతో శర్వానంద్ కొత్త మూవీపై అంచనాలు పెరిగాయి. అలాగే మరో వైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా చేస్తున్న సినిమాకు పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ ‘జానీ’ని వాడుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది.