The Paradise Glimpse :నేచురల్ స్టార్ నాని (Nani) తాజాగా సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అదే ది ప్యారడైజ్ (The Paradise). భారీ అంచనాలతో ఇంటెన్స్ యాక్షన్ తో భారీ స్కేల్లో రాబోతున్న చిత్రమిది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని మరొకసారి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవలే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించిన చిత్ర బృందం.. ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేయడంతో.. ఇది చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో అసభ్యకర పదజాలంతో డైలాగ్స్ ఉండడంతో అటు ఆడియన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా ముఖ్యంగా మాస్ యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో సినిమా చూసే ఆడియన్స్ కి ఇది బాగా నచ్చేలా ఉందని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
గ్లింప్స్ లో ఏముందంటే..?
ఇక గ్లింప్స్ మొదలవగానే.. “చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాశిండ్రు గానీ.. గదే జాతిలో బుట్టిన కాకుల గురించి రాయలే” అంటూ తెలంగాణ యాసలో టీజర్ ప్రారంభం అయింది. “తిండి లేక కడుపు మండిన కాకుల కథ ఇది. జమానా జమానాల కెళ్ళి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక.. రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. ఒక్కడొచ్చి మొత్తం జాతిలోనే జోష్ తీసుకొచ్చిండు. తూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టాయి. ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన వ్యక్తి కథ.. కడుపు మండిన కాకుల కథ ” అంటూ సాగిన ఈ గ్లింప్స్, డైలాగ్స్ చూసినవారికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నానని చెప్పవచ్చు.
SSMB 29 Shooting Update : ఇక నుంచి అవుట్ డోర్ షూటింగ్… ఎవరూ గెస్ చేయలేని లొకేషన్‌లో షూట్ ?
యాక్షన్ హీరోగా మారిన నాని..
ముఖ్యంగా ఇది చూసిన చాలామంది నెటిజన్స్ సాఫ్ట్ బాయ్ కాస్త ఊర మాస్ అయిపోయారు. నాని ఇకనుంచి అన్ని యాక్షన్ సినిమాలే చేస్తారా? అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇదివరకే ‘దసరా’ సినిమాతో ఊర మాస్ లెవెల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని, త్వరలో రాబోయే ‘హిట్ 3’లో కూడా చాలా వైలెంట్ గా కనిపించనున్నారు. ఇక ఇప్పుడు రాబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు నాని. ఏది ఏమైనా నాని ఇక అన్ని ఇదే జానర్ లోనే సినిమాలు చేస్తారా అనే అనుమానాలు కూడా ఆడియన్స్ లో వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి . ఇక ప్యారడైజ్ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తూ ఉండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఇక ప్రస్తుతం నాని ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మిస్తూ బిజీగా మారారు.