E-Paper
Advertisement

OTT Movie : ‘కే ర్యాంప్’ నుంచి ‘డ్యూడ్’ వరకు… ఓటీటీలోకి 2 రోజుల్లోనే అడుగు పెట్టనున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలు

OTT Movie : ‘కే ర్యాంప్’ నుంచి ‘డ్యూడ్’ వరకు… ఓటీటీలోకి 2 రోజుల్లోనే అడుగు పెట్టనున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలు
Advertisement

OTT Movie : దీపావళి సీజన్ ముగిసినా, సినిమా ఫీవర్ మాత్రం తగ్గలేదు! థియేటర్‌లలో హిట్ అయిన సినిమాలు ఇప్పుడు కూడా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లకు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్‌లో ‘కే ర్యాంప్’, ‘డ్యూడ్’, ‘బైసన్’, ‘తెలుసు కదా’ వంటి మోస్ట్ అవైటెడ్ సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తునాయి. రొమాన్స్, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా, మిస్టరీలతో వచ్చిన ఈ సినిమాలను మీ సోఫాలోనే కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇవి ఏ ఓటీటీలోకి రాబోతున్నాయి ? వీటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను, తెలుసుకుందాం పదండి.

1. ‘కే ర్యాంప్’ (K-Ramp)

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ కాలేజ్ రొమాంటిక్ డ్రామా, దీపావళికి థియేటర్లలో రిలీజ్‌ అయింది. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంతో పాటు, యుక్తి తరేజా, వెన్నెల కిషోర్, సాయికుమార్ నటించారు. ఈ సినిమా 2025 నవంబర్ 15న Aha Videoలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. ఈ స్టోరీ గ్రామీణ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సిటీ కాలేజ్ లైఫ్‌లోకి వచ్చిన ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. లవ్, ఫ్రెండ్‌షిప్, చిన్న చిన్న కాన్‌ ఫ్లిక్ట్‌లతో ఎంగేజింగ్ గా అతని జర్నీ ఉంటుంది. మొదటి హాఫ్ ఫన్నీ గా, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. యూత్‌కి పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్. థియేటర్‌లో మిస్ అయితే, Ahaలో చూసేయండి. ఇది ఐయండిబిలో 8.3/10 రేటింగ్ పొందింది.

2. ‘డ్యూడ్’ (Dude)

Advertisement

ప్రదీప్ రంగనాథన్ మార్క్ కామెడీతో 100 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్‌ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది. కీర్తిస్వరాన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, ఆర్. సరత్‌కుమార్, హృదు హరూన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా Netflix లో 2025 నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ కథ ఈవెంట్ ప్లానర్ గా లైఫ్ ని స్టార్ట్ చేసే యువకుడి చుట్టూ తిరుగుతుంది. లవ్, సర్ప్రైజ్ ట్విస్ట్‌ల ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఐయండిబిలో 6.8/10 రేటింగ్ ఉన్న ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ వాచ్.

3. ‘బైసన్’ (Bison Kaalamaadan)

ధ్రువ్ విక్రమ్ కరెర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో వచ్చిన ఈ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, నీలం స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై నిర్మించిన ఈ సినిమా, కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్, పశుపతి, అమీర్, లాల్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, అళగం పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బైసన్ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలై ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇది థియేటర్లలో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ సినిమా Netflix లో 2025 నవంబర్ 14 నుంచి అందుబాటులో ఉండబోతోంది. ఐయండిబిలో దీనికి 8.3/10 రేటింగ్ ఉంది. స్పోర్ట్స్ ఫ్యాన్స్ కి ఇది మస్ట్ వాచ్ మూవీ.

4. తెలుసు కదా (Telusu Kada)

Advertisement

ఈ తెలుగు రొమాంటిక్ సినిమాను టి. జి. విశ్వ ప్రసాద్ వివేక్ కుచిభోట్ల నిర్మించారు. ఈ సినిమాకి నీరజ కోన దర్శకత్వం వహించింది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చాడు. సర్రోగసీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తిగా సాగుతుంది. ఈ సినిమా 2025 నవంబర్ 14 నుంచి Netflix లో స్ట్రీమింగ్ కి రాబోతోంది.

 

Read Also : ఫోన్ కాల్ తో కిర్రాక్ స్కామ్… ఈ వెబ్ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

Related News

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

Big Stories

Advertisement
×