OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. కొన్ని సినిమాలలో ట్విస్టులు చివరి వరకు పిచ్చెక్కిస్తూ ఉంటాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో, క్లైమాక్స్ వరకు అసలు విషయం బయటపడదు. ఆ రెండున్నర గంటలు ఈ సినిమా చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ మూవీ భార్య, భర్తల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మై క్లైంట్స్ వైఫ్’ (My clients wife). గృహ హింస ఆరోపణలపై రఘురామ్ అరెస్టు అయినప్పుడు, అతని న్యాయవాది మానస్ వర్మ కేసును దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే రహస్యాలు, అబద్ధాలతో ఈ కేసు తికమక పెడుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రఘురామ్ అటెం టు మర్డర్ కేసులో అరెస్ట్ అవుతాడు. అతడు అటాక్ చేసింది ఎవరినో కాదు అతని భార్యనే. ఈ కేసును మానస్ అనే లాయర్ వాదించడానికి వస్తాడు. రఘురామ్ ను ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. దానికి అతడు ఈ విషయం నా భార్యని అడిగితే తెలుస్తుంది అని చెప్తాడు. లాయర్ అతని భార్య సింధురా దగ్గరికి వెళ్తాడు. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉంటుంది. తలకు గాయం అవడంతో కట్టు కట్టుకుని ఉంటుంది. ఇంట్లో పని వాళ్ళు కూడా అనుమానస్పదంగా ఉంటారు. తన భర్త అనుమానంతో హత్యాయత్నం చేశాడని ఆమె చెబుతుంది. మరోవైపు రఘురాం తనకి మగవాళ్ళను వశపరచుకొనే విద్య తెలుసని, నిన్ను కూడా ఆమె వదలదని చెప్తాడు. ఒక్కొక్కరు ఒక్కోలా స్టోరీ చెప్తూ ఉంటారు. కేబుల్ టీవీ వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్తాడు. భార్య మాత్రం టీవీ రిపేర్ కోసమే వచ్చాడని, ఇంతలో తన భర్త వచ్చి అనుమానించాడని చెప్తుంది. చివరికి పోలీసులకు కూడా ఈ కేసు తికమక పెడుతూ ఉంటుంది.
లాయర్ ని అర్జెంట్ పని ఉందంటూ సింధూర పిలుస్తుంది. వచ్చిన వెంటనే అతన్ని బంధిస్తుంది. అతనితో ఏమేం పనులు చేయాలో అన్నీ చేస్తుంది. చివరికి అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. ఈ కథలో ఈ క్యారెక్టర్లు వేసేది లాయర్ మాత్రమే. నిజానికి అతడు లాయర్ కూడా కాదు. ఎదురింటి వాళ్ళ లాగా భార్య దగ్గరికి వచ్చి, రొమాన్స్ చేసే ఒక ఫాంటసీ దిక్కుమాలిన జబ్బు ఉంటుంది. ఈ వింత ప్రవర్తనతో భార్య విసిగిపోతుంది. చివరికి వీరి సంసార జీవితం ఎటు పోతుంది? అనే విషయం తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మై క్లైంట్స్ వైఫ్’ (My clients wife) అనే ఈ మూవీని చూడండి.