E-Paper
Advertisement

AP Budget 2025-26: ఏపీ బడ్జెట్.. ఆ శాఖకు భారీ కేటాయింపులు

AP Budget 2025-26: ఏపీ బడ్జెట్.. ఆ శాఖకు భారీ కేటాయింపులు
Advertisement

AP Budget 2025-26:  ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మొత్తం రూ. 3.22 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత పాలకులు ప్రతి శాఖలో ఆర్థిక అరాచకం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది.

అప్పు తీసుకునే శక్తి లేని ఏకైరా రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు ఆర్థిక మంత్రి. సీఎం మాటల స్ఫూర్తితో బడ్జెట్‌ను రూపొందించినట్టు వెల్లడించారు. 2014-19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను అధిగమించడంలో సీఎం చంద్రబాబుకు ఆయనే సాటన్నారు. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో చంద్రబాబు పగ్గాలు చేపట్టారన్నారు.

Advertisement

2025 26 వార్షిక బడ్జెట్ లో కీలక అంశాలు.

-రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ‌

Advertisement

-వ్యవసాయానికి రూ.48వేల కోట్లు

– రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు

– రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు

– మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు

– ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా

-జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 1.82 శాతం అంచనా

-జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 4.38 శాతం అంచనా

-పాఠశాల విద్యాశాఖకు రూ. 31,805 కోట్లు

– నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ. 1,228 కోట్లు

– బీసీ సంక్షేమం కోసం రూ. 47, 456 కోట్లు

-ఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లు

-ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు

-అల్ప సంఖ్యాక వర్గాల కోసం రూ. 5,434 కోట్లు

– వైద్యరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లు

-పంచాయితీరాజ్ గ్రామీణ అభివృద్ధికి రూ. 18,848 కోట్లు

-పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు

-ఇందన శాఖకు రూ 13,600 కోట్లు

-వ్యవసాయ శాఖకు రూ.11,636 కోట్లు

-సాంఘిక సంక్షేమానికి రూ. 10,909 కోట్లు

-ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి రూ. 10,619 కోట్లు

-పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు

– మహిళ శిశు సంక్షేమ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం రూ. 4,332 కోట్లు

-గృహ నిర్మాణ శాఖకు రూ. 6,318 కోట్లు

– జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు

– పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు

– ఇంధన శాఖకు రూ. 13,600 కోట్లు

– రోడ్లు, రహదారులు శాఖకు రూ. 8,785 కోట్లు

– యువజన పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 469 కోట్లు

– తెలుగు భాష అభివృద్ధి-ప్రచారం కోసం రూ. 10 కోట్లు

-మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయం 2.0 కార్యక్రమానికి రూ. 10 కోట్లు

– అన్నదాత సుఖీభవ కోసం రూ. 6,300 కోట్లు

– పోలవరం కోసం రూ. 6,705 కోట్లు

– జల్ జీవన్ మిషన్ కోసం రూ. 2800 కోట్లు

-తల్లికి వందనం కోసం రూ. 9,407 కోట్లు

-ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు రూ. 27, 518 కోట్లు

-ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు

-దీపం 2.0 పథకానికి రూ. 2,601 కోట్లు

-మత్య్సకార భరోసాకు రూ. 450 కోట్లు

-స్వచ్ఛాంధ్ర కోసం రూ. 820 కోట్లు

-డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం రూ 3,486 కోట్లు

-ఆదరణ పథనాకికి రూ. 1000 కోట్లు

-పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం కోసం వినూత్న పథకం, 20శాతం వరకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా స్కీమ్

– పీపీపీ ప్రొత్సాహానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు రూ. 2000 కోట్లు

 

Related News

ఉరికొయ్యకు వేలాడిన తల్లి.. ఆ పాదాల చెంతే కన్నీటి పర్యంతమైన పసిగుండె!

విజయనగరం జిల్లాలో బొత్స ఆధిపత్యానికి మేనల్లుడు గండి.. చక్రం తిప్పనున్న మేనల్లుడు చిన్న శ్రీను

జగన్ దారిలో వైసీపీ నేతలు.. చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. మరో ఆరునెలల్లో ఎన్నికలు-తడాఖా చూపిస్తాం

పరిషత్ ఎన్నికల్లో దేవుడి స్క్రిప్ట్ రిపీట్.. 17 జిల్లాల్లో వైసీపీ ఎన్నిసీట్లు అంటే.. ఆ 11 జిల్లాలు మాత్రమే

కంచుకోటలు కూలినా వైసీపీ పరువు కాపాడిన అల్లూరి జిల్లా.. జెడ్పీ పీఠంపై ఫ్యాన్ పార్టీ, కూటమిని దెబ్బ కొట్టిన

స్థానిక ఎన్నికల్లో తండ్రీ-కొడుకులకు భయం.. ఆ భయం నన్ను వెంటాడుతోంది-అంబటి, ‘బిగ్‌టీవీ స్ట్రెయిట్ టాక్‌’లో..

పరిషత్ ఎన్నికల ఫలితాలపై జగన్ రియాక్ట్.. ప్రజల మనసులు గెలుచుకున్నాం

పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు.. పల్లెల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న అధికార పార్టీ

Big Stories

Advertisement
×