Vijayashanti:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న విజయశాంతి (Vijayashanti ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. తన 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో నటించిన ఈమె.. సుమారుగా 180 సినిమాలకు పైగా నటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో నటించిన ఈమె విశ్వ నటభారతి, లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబ్ గా పలు బిరుదులు కూడా సొంతం చేసుకుంది. 1991లో ‘కర్తవ్యం’ సినిమాలో నటించిన నటనకు గానూ ఏకంగా జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలతో పాటు ఆరుసార్లు ఉత్తమ నటి పురస్కారాలను అందుకున్న ఈమె.. ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈమె హీరోలతో సమానంగా పోటీపడుతూ సినిమాలు చేసేది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలకు దీటుగా నటించి పాపులారిటీ సొంతం చేసుకుంది విజయశాంతి.
Producer Kedar: నిర్మాత పోస్ట్ మార్టం రిపోర్ట్.. అనుమానాలు తీరలేదా..?
NKR 21 తో విజయశాంతి ఎంట్రీ..
అలాంటి విజయశాంతి రాజకీయాలలోకి వెళ్లిపోయిన తర్వాత ఇండస్ట్రీకి దాదాపు దూరమైందనే చెప్పాలి. కానీ చాలా ఏళ్ల తర్వాత మహేష్ బాబు (Maheshbabu ) హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన నటనతో అబ్బురపరిచింది.. ఈ వయసులో కూడా ఆమె తన నటనతో ఆకట్టుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మళ్లీ విజయశాంతి సినిమాలలో కనిపించలేదు. దీంతో శాశ్వతంగా ఇండస్ట్రీకి దూరమైందనే వార్తలు వినిపించాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ (Kalyan Ram) 21వ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది విజయశాంతి. చివరిగా ‘డెవిల్’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘రుద్ర’ అంటూ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ముప్పాల వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో..
మనుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్ లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారట. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందుతున్న సినిమా కూడా కావడం గమనార్హం . ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది. యాక్షన్ సినిమా కావడంతో టైటిల్ కూడా సెట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు రుద్ర అనే మరొక టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో విజయశాంతి మరొకసారి పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రానికి లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. మరి కర్తవ్యం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయశాంతి.. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.