BigTV English
Advertisement

Romantic Movie In OTT : నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Romantic Movie In OTT : నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Romantic Movie In OTT : రొమాంటిక్ మూవీలకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే కొత్త కంటెంట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేస్తే మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. ఆ సినిమాలన్నీ ఓటీటీలో మంచి వ్యూస్ ను అందుకుంటున్నాయి.. తాజాగా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ మరో మూవీ ఓటీటీలోనే డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంది. ఇది ఒక తెలుగు మూవీ.. దాంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మూవీ పేరు నీలి మేఘ శ్యామ.. మొదట థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల మూవీని ఓటీటీలో విడుదల చేయాల్సిన వచ్చింది. ఆ మూవీ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


 

నీలిమేఘ శ్యామ ఓటీటీలోకి రానున్న విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.. ఈ మూవీ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. డిసెంబర్ నెలాఖరున ఈ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.. ఇక ఈ మూవీలో విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. రవి ఎస్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. హర్షవర్ధన్‌, తనికెళ్లభరణి కీలక పాత్రల్లో కనిపించారు.రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ చక్కటి సంగీతాన్ని అందించాడు.


 

ఈ మూవీ సరికొత్త లవ్ స్టోరీగా రాబోతుంది. స్టోరీ విషయానికొస్తే.. టైటిల్ రోల్ చేస్తున్న శ్యామ్ అనే వ్యక్తి అల్లరి యువకుడు. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఎప్పుడూ తండ్రి చేతిలో తిట్లు తింటుంటాడు. హఠాత్తుగా ఓ రోజు ఇంట్లో వాళ్లతో పాటు స్నేహితులకు చెప్పకుండా మనాలి వెళ్లిపోతాడు. అక్కడ అందాలతో పాటుగా ఇతనికి గైడ్ గా ఉండే మేఘ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? భిన్న మనస్తత్వాలు కలిగిన ఆ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగింది? అసలు శ్యామ్ మనాలి ఎందుకు వెళ్లాడు అన్నదే ఈ మూవీ కథ.. థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. దాంతో ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానె ఉన్నాయని తెలుస్తుంది.. విశ్వదేవ్ రాచకొండ. ప్రసాద్ అనే బస్ కండక్టర్ పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. 35 చిన్న కథకాదు మూవీలో నివేథా థామస్ హీరోయిన్‌గా నటించింది. రీసెంట్ గా తెలుగులో 35 చిన్న కథ కాదుతో పాటు కిస్మత్‌, పిట్టగొడ, ఛల్తే ఛల్తేతో పాటు తెలుగులో పలు సినిమాల్లో మెరిసాడు. ఇక సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది హీరోయిన్. ఈమె తరగతి గది దాటి అనే వెబ్‌సిరీస్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాధాకృష్ణ. ఆలా నిన్నుచేరితో పాటు అనేక సినిమాల్లో నటించి యూత్ క్రష్ అయ్యింది.. ఈ సరికొత్త రొమాంటిక్ మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..

Tags

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×