OTT Movie : మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఓటీటీ లో ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. రీసెంట్గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కుంచాకో బోబన్, ఇతని భార్య రా ప్రియమణి నటించింది. చివరి వరకు సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది ఈ సినిమా. పోలీస్ ఆఫీసర్ కూతుర్లనే టార్గెట్ చేసిన ఓ సైకో గ్యాంగ్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on duty). 2025 లో విడుదలైన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీశ్, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్ & ఈఫోర్ సంస్థ బ్యానర్‌పై మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబి చవారా నిర్మించగా, ఈ సినిమాకు జితు అష్రఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో ఫిబ్రవరి 20న ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఫిబ్రవరి 28న విడుదల చేయగా, మార్చి 7న మైత్రి మూవీ తెలుగులో విడుదల చేసింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లోకి రాబోతోందని సమాచారం.
స్టోరీ లోకి వెళితే
హీరో డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఇతడు చేసిన ఒక తప్పు వల్ల డిఎస్పి నుంచి డి ప్రమోట్ అవుతాడు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. ఆ సమయంలో హీరో దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఆ కేసులో అమ్మాయిల వీడియోలతో బెదిరించి కొంతమంది వ్యక్తులు బంగారు గొలుసులను తీసుకుంటారు. ఆ వీడియోలతో వాళ్ళను బ్లాక్ మెయిల్ కూడా చూస్తుంటారు. ఇంట్లో వాళ్ళు గొలుసు తాకట్టు పెట్టినప్పుడు ఈ విషయం బయట పడుతుంది. అయితే గతంలో కూడా హీరో కూతురు ఇలానే చనిపోయి ఉంటుంది. ఓ వ్యక్తి ప్రేమ పేరుతో వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఆ వ్యక్తిని చంపడం వల్లే హీరోను డి ప్రమోట్ చేస్తారు. అప్పుడు ఆ కేసు ముగిసిపోయింది అనుకుంటాడు హీరో. అయితే ఆ స్కామ్ లో మిగతా వ్యక్తులు కూడా ఉంటారు. అయితే వీళ్ళంతా పోలీసు కూతుర్లను మాత్రమే టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తలుసుకుంటాడు హీరో.వాళ్లను పట్టుకునే క్రమంలో హీరో కొన్ని సమస్యలు ఫేస్ చేస్తాడు. చివరికి హీరో ఆ క్రిమినల్స్ ని పట్టుకుంటాడా? ఆ సైకోలు పోలీస్ కూతుర్లని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer on duty) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.