Gundeninda GudiGantalu Today episode march 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం ప్రభావతిని తిడతాడు అసలు నువ్వు తల్లివా లేక రాక్షసివ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కొంచమైన నీకు బుద్ధుందా అంటూ సత్యం అంటాడు. నా కూతురు ఫంక్షను సవ్యంగా జరగాలంటే ఆ బాలు గాడు ఉండకూడదు అది మీరు చెప్తారా లేదా నన్ను చెప్పమంటారా? నేను ఏమి వాణ్ని శాశ్వతంగా వదిలిపెట్టి పొమ్మని చెప్పలేదు ఆ ఫంక్షన్ వరకు వెళ్ళిపొమ్మని చెప్తున్నాను అని ప్రభావతి అంటుంది.. బాలు మాత్రం ఈ ఫంక్షన్ కి డబ్బులు ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఇంకా కొన్ని ట్రిప్పులు ఎక్కువగా వేసుకోవాలని అనుకుంటాడు.
చెల్లి మౌనిక తాళి మార్చే ఫంక్షన్ కు కావాల్సిన డబ్బును సమకూర్చడంలో నిమగ్నమై ఉన్నాడు. అందుకు సంబంధించిన పనులు చేస్తున్నాడు. తాను కూడబెట్టిన డబ్బులకు ఇంకా అవసరం పడటంతో డే అండ్ నైట్ కారు డ్రైవ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు.
తిండి, నిద్ర మానేసి నాన్ స్టాప్ గా రైడ్స్ కొడుతూనే ఉంటాడు. రెండు అరటిపండ్లు తిని కడపునింపుకోవడమే కాకుండా… చెల్లి ఫంక్షన్ ఘనంగా చేయాలనే తపనలో తనకు గాయాలైనా పట్టించుకోడు. బాలు అంత కష్టపడుతుంటే మీనా కూడా చూసి తట్టుకోలేకపోతుంది. భర్త రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఎంతో టెన్షన్ పడుతుంది. బాలు మాత్రం ఫోన్ కూడా మాట్లాడకుండా రైడ్స్ కొడుకుతూ డబ్బులు సంపాదించే లక్ష్యంలో మునిగిపోతాడు.. మొత్తానికి బాలు అనుకున్న విధంగా అధికంగా ట్రిప్పులు వేసుకొని ఇంట్లో ఫంక్షన్ కి కావాల్సిన డబ్బులు ని అరేంజ్ చేస్తాడు.. బాలు అంత కష్టపడి డబ్బులు సంపాదించి ఇచ్చినా కూడా ప్రభావతి మాత్రం బాలు ఈ ఫంక్షన్ కి రావడానికి వీల్లేదు అంటూ సత్యం కి వార్నింగ్ ఇస్తుంది. ఎలాగైనా బాలుని ఫంక్షన్ కి రాకుండా మీరు చెప్తారా నన్ను చెప్తారా అంటూ అడుగుతుంది కానీ సత్యం మాత్రం తన కొడుకు కష్టపడుతూ ఫంక్షన్కు రావద్దు అంటే తన గుండె ముక్కలవుతుందని బాధపడుతూ ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు చేతికి గాయం తగిలినట్టు మీనా గమనిస్తుంది.. ఇది చిన్న గాయమని మీరంటున్నారు కానీ ఇది చాలా పెద్దగాయమండి అని అనగానే నాకు అస్సలు ఓపిక లేదు నేను వెళ్లి ఫ్రెష్ అవుతాను నాకు అన్నం తీసుకురావని మీ నాకు చెప్పి బాలు లోపలికి వెళ్ళిపోతాడు. చెయ్యి నొప్పితో బాధపడుతున్న బాలుకు మీనా అన్నం తినిపిస్తుంది. మీరు చెల్లెలు కోసం ఎంత చేస్తున్నారు? రేపు ఎవరైనా ఏదైనా అంటే మీరు కోపంతో రెచ్చిపోతారు. అది మాత్రం తగ్గించుకోండి అని మీనా అంటుంది. భార్య చెప్తే వినకుండా ఉంటారా అని బాలు సెటైర్ వేస్తాడు. అటు సత్యం బాలుకి విషయాన్ని ఎలా చెప్పాలని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాత్రం మీ కొడుకు మీద ప్రేమ పొంగు కొచ్చింది కదా మరి మౌనిక ఫంక్షన్ ఆపేద్దామా వాళ్ళ అసలు ఒప్పుకోరు కదండీ మీరు ఏదైనా ఆలోచించాలి కదా అంటూ సత్యం కు చెబుతుంది.
ఉదయం లేవగానే బాలు హడావిడి చేస్తాడు. కోసం బాగా రెడీ అయ్యి మీనా తో అన్ని ఉన్నాయా అంటూ హడావిడిగా కనిపిస్తాడు.. రవిని అది లేచిపోయినోడా నువ్వు వంటవాడివే కదా మీ వదినకి సాయం చేయొచ్చు కదా అని అనగానే. నువ్వు నల్ల బీమా అని నన్ను ప్రేమగా పిలిస్తే నేను వదినకు ఖచ్చితంగా సాయం చేస్తాను అంటాడు. కానీ బాలు మాత్రం మీనా ఈ వంట పని నువ్వే కష్టపడి ఎలాగోలాగా పూర్తి చేయు వీడిని మాత్రం నేను నల్ల బీమా అని పిలిచేది లేదు అంటూ సరదాగా మాట్లాడుతాడు.
అటు మనోజ్ ని కూడా వదలకుండా బాలు సెటైర్లు వేస్తాడు రోహిణి మాత్రం మనోజ్ పై అరుస్తూ ఉంటుంది. నేను పుస్తక తాడు కోసం మంగళసూత్రాన్ని ఆర్డర్ ఇచ్చాను ఈ రాజేష్ గాడు తీసుకొచ్చాడో లేదో అంటూ బాలు హడావిడిగా అందరిపై అరుస్తూ ఉంటాడు. బాలు ఎంతో సంతోషంగా మిగిలిన పనులన్నీ చేస్తున్నాడు. పంచె, ఎర్రచొక్కాలో హుందాగా రెడీ అయ్యి సందడి చేస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే ఇంట్లో వాళ్లమీద పంచులు వేస్తూనే నవ్వులు పూయిస్తాడు. అయితే మౌనికా వాళ్ల అత్తగారు బాలును ఫంక్షన్ లో ఉండొద్దనే కండీషన్ పెట్టినా.. సత్యం మాత్రం కన్నకొడుకుకు ఎలా చెప్పాలో తెలియక, చెప్పలేక గమ్మునుండిపోతాడు.. అని ప్రభావతి మాత్రం నువ్వు వెంటనే వెళ్లి ఒక పూజ చేయాలి అది కూడా కాకినాడకు వెళ్లి పూజ చేయించాలి. నేను మౌనిక కోసం మొక్కుకున్నాను అని అనగానే ఇంత ఫంక్షన్ హడావిడిలో అంత దూరం వెళ్లి పూజ చేయాలా ఇప్పుడు ఎందుకు తర్వాత వెళ్ళొచ్చు కదా అనేసి బాలు అడుగుతాడు కానీ ప్రభాది మాత్రం తన మనసులోని మాటని కఠినంగా బయట పెట్టేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలుకు సత్యం నిజం చెప్పబోతాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..