Rajinikanth : చాలావరకు సినిమాలు థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఎక్కువ కాలం గ్యాప్ తీసుకోకుండా ఓటీటీతో అడుగు పెడుతుంటాయి. కొన్ని సినిమాలైతే థియేటర్లలోకి వచ్చి నెల కూడా గడవక ముందే ఓటీటీలో సందడి చేస్తాయి. కానీ తమిళ తలైవా రజినీకాంత్ (Rajinikanth) నటించిన మూవీ ‘లాల్ సలాం’ (Lal Salaam)కి మాత్రం ఏడాది గడిచినా ఓటీటీ స్ట్రీమింగ్ కు మోక్షం మాత్రం దక్కలేదు. అసలు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుందా లేదా ? అనే విషయంపై ఇప్పటిదాకా తలైవా అభిమానులకు క్లారిటీ లేదు.
‘లాల్ సలాం’కు ఏడాది పూర్తి
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కీలక పాత్ర పోషించిన మూవీ ‘లాల్ సలాం’ (Lal Salaam). తమిళ యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఈ స్పోర్ట్స్ డ్రామాలో హీరోలుగా నటించారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ, బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయి నిన్నటితో ఏడాది పూర్తయింది. కానీ మేకర్స్ మాత్రం ‘లాల్ సలాం’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఉలుకూ పలుకూ లేకుండా సైలెంట్ గా ఉన్నారు.
‘లాల్ సలాం’ (Lal Salaam) మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దక్కించుకున్నాయని ప్రచారం జరిగింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ కూడా హింట్ ఇచ్చారు. అయితే కారణం ఏంటో తెలియ రాలేదు కానీ, ఇప్పటిదాకా ఈ మూవీ ఇంకా ఓటీటీలో అడుగు పెట్టక పోవడంపై రజనీకాంత్ అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హార్డ్ డిస్క్ గొడవ
‘లాల్ సలాం’ (Lal Salaam) మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చాక డైరెక్టర్ ఐశ్వర్య స్పందిస్తూ షూటింగ్ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ అప్పట్లో మిస్సయిందని అన్నారు. ఆ సీన్స్ గనుక ఉండి ఉంటే ఈ మూవీ మరో రేంజ్ లో ఉండేదని ఆమె చెప్పిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ఐశ్వర్య ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ తమకు దొరికిందని, ‘లాల్ సలాం’ కొత్త వర్షన్ ను నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. మూవీ కొత్త వర్షన్ కి ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాల్సి ఉందని, ఆ తర్వాత స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. కానీ ఆమె ఈ మాట చెప్పి కూడా నెలలు గడుస్తోంది. అయినప్పటికీ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇప్పటి దాకా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో, అసలు ‘లాల్ సలాం’ మూవీ ఓటీటీలోకి వస్తుందా లేదా ? అనే అనుమానాలు నెలకొన్నాయి సూపర్ స్టార్ అభిమానుల్లో. ఇక ఇప్పటికే ఈ మూవీ ఒకటి రిలీజ్ అయ్యిందనే విషయాన్ని కూడా ప్రేక్షకులు మర్చిపోయారు.