OTT Movie : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. ట్రంప్ కెరీర్, అధికారంలోకి రావడం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 1970, 1980లలో న్యూయార్క్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ట్రంప్ కెరీర్ ఎలా నడిచిందనేది హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమా వివాదాల కారణంగా చాలా కాలం స్ట్రీమింగ్ కి నోచుకోలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులను తొలగించుకుని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆస్కార్ కి నామినేట్ చేయబడిన ఈ సినిమాని చూడటానికి ఆడియన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఏ ఓటీటీలో కి వచ్చింది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘అప్రెంటీస్’ The Apprentice movie 2024లో డోనాల్డ్ ట్రంప్‌గా సెబాస్టియన్ స్టాన్ నటించిన బయోపిక్ సినిమాకి అలీ అబ్బాసి దర్శకత్వం వహించారు. గాబ్రియేల్ షెర్మాన్ రచించిన ఈ చిత్రంలో ట్రంప్ తండ్రి ఫ్రెడ్‌గా మార్టిన్ డోనోవన్, ట్రంప్ మొదటి భార్య ఇవానాగా మరియా బకలోవా నటించారు. ఈ బయోపిక్ మే 2018లో ప్రకటించబడింది. అయితే 2023లో అబ్బాసీ, స్టాన్ స్ట్రాంగ్ చేరే వరకు అది మొదలవ్వలేదు. ఇది 2024 మే 20న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. కొన్ని వివాదాల తరువాత 2024 అక్టోబర్ 11న థియేటర్‌లో ఈ సినిమా విడుదల అయింది. అక్టోబర్ 24 నుంచి లయన్స్‌గేట్ ప్లే, OTTplay లలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
డొనాల్డ్ ట్రంప్ తన తండ్రి ఫ్రెడ్‌తో కలిసి అపార్ట్‌మెంట్లు కడతాడు. అతని తండ్రి నల్ల వాళ్ళకు ఇళ్ళు అమ్మకపోవడంతో కేసు కూడా నడుస్తుంది. ట్రంప్ ఫ్యామిలీ డబ్బు ఇచ్చి అప్పట్లో ఈ కేసును ముగిస్తుంది. కానీ యంగ్ ట్రంప్‌కు పెద్ద కలలు ఉంటాయి. మానహాట్టన్‌లో భారీ హోటల్ కట్టాలని అతనికి ఉంటుంది. అతను బ్యాంకులు, పెద్దవాళ్లతో మాట్లాడుతాడు. కానీ ఫైనాన్షియల్ గా అంత డబ్బు రాదు. ఈ సమయంలో రాయ్ కోన్ అనే ఒక పెద్ద లాయర్ ఎంట్రీ ఇస్తాడు. కోన్ చాలా క్రూరమైన వ్యక్తి. అతను ట్రంప్‌కు 3 నియమాలు నేర్పుతాడు: ఎవరైనా తప్పు చేస్తే వెంటనే దాడి చెయ్. ఎప్పుడూ క్షమాపణ చెప్పకు. ఏమైనా సరే, ఎలాగైనా సరే గెలవాలి.
కోన్ సాయంతో ట్రంప్ పెద్ద డీల్స్ చేస్తాడు. గ్రాండ్ హైట్ హోటల్ కడతాడు. ఇవానాను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. ట్రంప్ పెద్దవాడవుతాడు. ట్రంప్ ఇప్పుడు చాలా పవర్‌ఫుల్. ట్రంప్ పెద్ద టవర్ కడతాడు. కానీ అతను మారిపోతాడు. ఎవరినీ పట్టించుకోడు. ఇవానాతో గొడవలు పెరుగుతాయి. ఒక సీన్‌లో ఇవానాను బలవంతం చేసినట్టు చూపిస్తారు. ఇది కాంట్రవర్సీ అయింది. ఇక లాయర్ కోన్ ఎయిడ్స్‌తో చనిపోతాడు. అతని చివరి దశలో ట్రంప్ అతని ఖర్చులు కూడా కట్ చేస్తాడు. డబ్బు, పేరు ఉన్నా, ఇప్పుడు ట్రంప్ కి తనకంటూ ఎవరూ ఉండరు. చివరికి ట్రంప్ ఒక్కడే మిగిలిపోతాడు.