OTT Movie : ఈ ఏడాది మోస్ట్ కాంట్రవర్సీ గా థియేటర్లో రిలీజైన తమిళ సినిమా ‘బ్యాడ్ గర్ల్’ వెట్రిమారన్ నిర్మించన ఈ మూవీ తొందర్లోనే ఓటీటీలోకి కూడా రాబోతోంది. అయితే ఈ సినిమా టీజర్ లో బ్రాహ్మణులను చెడుగా చూపించారనే ఆరోపణలు రావడంతో ఈ మూవీ వివాదాలకు తెర లేపింది. వెట్రిమారన్ తో పాటు విజయ్ సేతుపతిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ జరిగాయి. ఈ మూవీ టీజర్ ను డిలీట్ చేయాలని మద్రాస్ హైకోర్టు కూడా ఆదేశించింది. దీంతో సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్లు కట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసింది. థియేటర్లలో కూడా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ వివాదాల కారణంగా ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘బ్యాడ్ గర్ల్’ ఈ తమిళ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాకి వర్ష భరత్ దర్శకత్వం వహించగా, వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించారు. 2025 సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో నవంబర్ 4 నుంచి తమిళంతో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించగా, శాంతి ప్రియ, శరణ్య రవిచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి రెండు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కడం విశేషం.
Read Also : అమ్మాయిలను కిడ్నాప్ చేసి, వెర్రివేశాలేసే సైకో .. రాత్రయితే ఫ్యామిలీ అంటూ నరకం… ఆ పాడు పనులన్నీ ఒకే గదిలో
రమ్యా (అంజలి శివరామన్) తమిళనాడులోని కట్టుబాటు బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన యువతి. హైస్కూల్‌లో పర్ఫెక్ట్ ప్రియుడి కోసం కలలు కంటుంది. కానీ ఇంటి వాతావరణం మరోలా ఉంటుంది. పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ప్రతి దానికి కండిషన్లు, నియమాలు అంటూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. హైస్కూల్ లో ప్రేమలో పడటం, మళ్ళీ విడిపోవటం జరుగుతుంది. ఆ తరువాత కాలేజీలో ఆమె మళ్ళీ ప్రేమలో పడుతుంది. అక్కడ కూడా ప్రేమలో ఫైల్ అవుతుంది. కాలేజీ తర్వాత నిజ జీవితంలో రమ్యా పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం వెతుకుతుంది. ఈ వయసులో వచ్చే ఫీలింగ్స్ తో ఆమె పోరాడుతుంది. చివరికి ఆమెకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడా ? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అనే విషయాలను, వచ్చే వారం రిలీజ్ కానున్న ఈ సినిమాని చూసి తెలుసుకోండి.