OTT Movie : హాలీవుడ్ సినిమాలు లేకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఊహించుకోలేం. హాలీవుడ్ సినిమాలను మన ప్రేక్షకులు కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ చూస్తారు. అందులోనూ రొమాంటిక్ మూవీస్ ను చూడటానికి బాగా ఇష్టపడతారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బో*ల్డ్ కంటెంట్ తో థియేటర్లలో సక్సెస్ టాక్ తో వచ్చి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
రెండు ఓటీటీలలో
రొమాంటిక్ మూవీ లవర్స్ కు ఈ మూవీ ఒక బెస్ట్ సజెషన్. ఈ మూవీ పేరు మరేమిటో కాదు “ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే” (50 Shades of gray). ఈ మూవీ ప్రస్తుతం రెండు ఓటీటీలు జియో సినిమా (jio cinema), జి ఫైవ్ (zee 5) లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో స్టోరీ ఒక డబ్బున్న వ్యక్తి ,ఒక అందమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఈ మూవీలో హీరోయిన్ పేరు యానా. ఈమె డిగ్రీ చదువుతూ ఒక హార్డ్వేర్ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈమె ఫ్రెండ్ జర్నలిస్ట్ ఒక డబ్బున్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. అయితే ఆమెకు వేరే అత్యవసరమైన పని ఉండటంతో హీరోయిన్ కు ఆ అవకాశం ఇస్తుంది. హీరోయిన్ అతనిని ఇంటర్వ్యూ చేయడానికి వెళుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి అతని పేరు క్రిస్టిన్. అతడు చూడటానికి అందంగా ఉంటాడు అలాగే హీరోయిన్ కూడా చాలా అందంగా ఉండటంతో ఇద్దరూ ఒకరిని ఒకరు చూడగానే ఇష్టపడతారు. ఆరోజు ఇంటర్వ్యూ అయిపోగానే హీరోయిన్ తో క్రిస్టన్ నాకు ఒక ఫోటోషూట్ చేసే వ్యక్తి కావాలి అని చెప్తాడు. దానికి హీరోయిన్ తన ఫ్రెండును తీసుకొని ఫోటోషూట్ కు వస్తుంది.
అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. అతడి మాటలకు ఆమె బాగా అట్రాక్ట్ అవుతుంది. అతడు ఇదివరకే చాలామందితో అగ్రిమెంట్ చేసుకొని ఇంటిమేట్ అవుతాడు. అతడు బాగా రిచ్ కావడంతో తనతో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని ఆమెను కోరుతాడు. ఆ అగ్రిమెంట్ చాలా బో*ల్డ్ గా ఉంటుంది. అగ్రిమెంట్ చదివిన తర్వాత ఆమె సిగ్గుపడుతుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ ఒక పబ్బుకు వెళ్తూ తన ఫ్రెండ్ ని కూడా తీసుకెళ్తుంది. అక్కడినుంచి క్రిస్టన్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఎక్కువగా తాగి ఉన్నందున క్రిస్టన్ ఆమెకు ఏమైనా అవుతుందేమోనని అక్కడికి వచ్చి తీసుకువెళ్తాడు. తన ఇంట్లో ఒక గదిలో ఉంచి ఆమె డ్రెస్ రిమూవ్ చేసి బట్టలు మారుస్తాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇంతకీ ఆ అగ్రిమెంట్లో ఏమి రాసి ఉంటుంది? చివరికి వీళ్ళిద్దరి లవ్ ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే “50 షేడ్స్ ఆఫ్ గ్రే” (50 Shades of gray). మూవీని తప్పకుండా చూడాల్సిందే. రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ మూవీని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడటం బెట్టర్.