Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో కెప్టెన్స్ స్థానంలో చీఫ్స్ ఉంటారని ముందుగానే క్లారిటీ వచ్చింది. అయినా ఆ చీఫ్ స్థానం కోసం విష్ణుప్రియా పెద్దగా పోటీ పడలేదు. తనకు ఇప్పుడు చీఫ్ అవ్వాలని అనిపించడం లేదని, కొన్నాళ్ల తర్వాత అవుతానని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. గత కొన్నివారాలుగా మెగా చీఫ్ అవ్వడం కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. కానీ ఇతర కంటెస్టెంట్స్ అంతా సింపుల్‌గా తనను పక్కన పెట్టేశారు. తాజాగా టీమ్ అందరి సపోర్ట్‌తో మెగా చీఫ్ అయ్యింది. అసలు తనను మెగా చీఫ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయం కూడా తనకు క్లారిటీ లేదని తాజాగా జరిగిన నామినేషన్స్‌లో బయటపడింది.
గౌతమ్ ఫైర్
తాజాగా జరిగిన నామినేషన్స్‌లో ఎవరు నామినేట్ అవ్వాలి అనే నిర్ణయాన్ని మెగా చీఫ్ అయిన విష్ణుప్రియా చేతికి ఇచ్చారు బిగ్ బాస్. నామినేట్ చేసినవారిని జైలులో వేయాలని తెలిపారు. ముందుగా తను గౌతమ్‌ను నామినేట్ చేసింది. తన ఆట అంత బాలేదని, యష్మీ విషయంలో ఆడవాళ్లపై గౌరవం లేనట్టుగా మాట్లాడాడని కారణాలు చెప్పింది. అయితే తనకంటే బాగా ఆడనివాళ్లు హౌస్‌లో ఉన్నారని పృథ్వి గురించి ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడాడు గౌతమ్. అలా వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగితే నిఖిల్ జోక్యం చేసుకొని దానిని ఆపాడు. దాని తర్వాత ప్రేరణ.. తనను ఫేక్ ఫ్రెండ్ అన్నదని, అంతే కాకుండా ఇతర కంటెస్టెంట్స్‌కు లేకుండా తను మాత్రమే బజ్జీలు వేసుకొని తిన్నదని కారణాలు చెప్పి నామినేట్ చేసింది.
Also Read: మెహబూబ్ 3 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?
బజ్జీల గొడవ
ప్రేరణ, విష్ణుప్రియా మధ్య కాసేపు బజ్జీల గురించి గొడవ జరిగింది. మధ్యలో హరితేజ, నయని పావని మాట్లాడడానికి ట్రై చేసినా వారికి కూడా వార్నింగ్ ఇచ్చింది ప్రేరణ. గతవారం జరిగిన టాస్కులో టేస్టీ తేజ ప్రవర్తన అస్సలు బాలేదని తనను కూడా నామినేట్ చేసింది విష్ణుప్రియా. తను నిఖిల్‌తో చాలా దురుసుగా మాట్లాడాడని గుర్తుచేసింది. అసలు అలా ఎందుకు మాట్లాడాడో కారణం కూడా చెప్పాడు తేజ. ఆ తర్వాత నయని పావనిలో ఉన్న ఫైర్ బయటికి రావడం లేదనే కారణంతో నామినేట్ చేసింది విష్ణు. ప్రేరణ, నయని ఇద్దరూ జైలులోకి వెళ్లిన తర్వాత ప్రేరణ.. నయనిని పుడింగిలాగా మాట్లాడకు అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాంతో అమర్యాదగా మాట్లాడితే బాగుండదు అంటూ ప్రేరణకు వార్నింగ్ ఇచ్చింది నయని.
సపోర్ట్ చేయను
చివరిగా నబీల్‌లో ఫైర్ తగ్గిపోయిందనే కారణంతో నామినేట్ చేసింది విష్ణుప్రియా. అది నబీల్‌కు నచ్చలేదు. ఎమోషనల్ అయ్యాడు. తనవల్లే విష్ణుప్రియా చీఫ్ అయ్యిందని గుర్తుచేశాడు. కానీ విష్ణు అది ఒప్పుకోలేదు. తర్వాత టీమ్ అందరి మధ్య డిస్కషన్ జరిగింది. నబీల్ అన్న మాట తప్పు కాదని విష్ణుతో అన్నాడు నిఖిల్. నబీల్‌ను నామినేట్ చేయడం తన టీమ్‌లో ఎవ్వరికీ నచ్చలేదు. ముఖ్యంగా పృథ్వికి నచ్చలేదు. అందుకే తన టీమ్ నుండి ఇంకొక్కరు నామినేషన్‌లో ఉన్నా కూడా నెక్స్‌ట్ టైమ్ నుండి చీఫ్‌గా విష్ణుప్రియాకు సపోర్ట్ చేయనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇక నబీల్ సైతం అసలు టీమ్ సపోర్ట్ లేకపోతే విష్ణు చీఫ్ అయ్యేది కాదని ముక్కుసూటిగా చెప్పేశాడు.