OTT Movie : కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నిజ జీవితంలో జరిగే విధంగా అనిపిస్తుంది. ఈ సినిమాలను చూస్తున్నప్పుడు కళ్ళు కూడా చెమ్మగిళ్ళుతాయి. ఇటువంటి సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకొనే ఈ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా తో వచ్చిన ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘ఫ్లవర్స్ ఇన్ ది అటిక్‘ (Flowers in the attic). ఈ మూవీలో తండ్రిని కోల్పోతే, ఆ పిల్లలు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
క్రిస్టియన్, ఎలిజబెత్ ఇద్దరు భార్య భర్తలు పిల్లలతో కలిసి హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. క్రిస్టియన్ కి ప్రమోషన్ రావడంతో ఆరోజు పార్టీ చేసుకోవాలనుకుంటారు. అయితే ఒక యాక్సిడెంట్ లో క్రిస్టియన్ చనిపోతాడు. ఈ విషయం కుటుంబానికి తీరనిలోటు అవుతుంది. నలుగురు పిల్లలు ఉన్న ఆ తల్లి పిల్లలను పోషించడానికి భయపడుతుంది. ఒకప్పుడు పెద్దలను ఎదిరించి క్రిస్టియన్ ని పెళ్లి చేసుకుని ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లల కోసం తన తల్లి దగ్గరికి వెళుతుంది. అక్కడ వాళ్లు రిచ్ గా ఉండడం చూసి పిల్లలు కూడా ఆశ్చర్యపోతారు. అక్కడికి వెళ్లిన ఎలిజిబెత్ తల్లి పిల్లలకు కొన్ని కండిషన్ లు పెడుతుంది. పిల్లలు ఎక్కువగా అల్లరి చేయకూడదని చెప్తుంది. అయితే ఒక రోజు పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తారు. అందుకు ఎలిజిబెత్ తల్లి వాళ్ళని గట్టిగా కొట్టుతుంది. ఎలిజిబెత్ ఆమెన్ అడ్డుకొని ఎందుకు కొడుతున్నావ్ అని తిరగబడుతుంది. ఎలిజిబెత్ ని కూడా ఆమె కొడుతుంది. ఆ తర్వాత రోజురోజుకి ఎలిజిబెత్ లో మార్పు వస్తుంది. పిల్లలకి చెప్పకుండా మరొక పెళ్లి చేసుకుంటుంది. డబ్బు ఆశతో వేరే లైఫ్ ని చూసుకుంటుంది. ఈ విషయం తెలిసిన పిల్లలు ఆమెను అసహ్యించుకుంటారు.
ఒకరోజు ఇంట్లో ఒక పిల్లవాడికి జ్వరం వచ్చి చనిపోతాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న బ్రెడ్ ముక్క తిని ఎలుక కూడా చచ్చిపోతుంది. ఈ విషయం మిగిలి ఉన్న ముగ్గురు పిల్లల్లో పెద్ద పిల్ల అయిన కేతికి తెలుస్తుంది. మనల్ని చంపడానికి ఈ ఇంట్లో ఆహారంలో ఏదో కలుపుతున్నారని గ్రహిస్తారు. ఆ తర్వాత ఎలిజబెత్ తల్లి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కరెంట్ ఆఫ్ చేస్తారు. ఆమెకు చీకటి అంటే భయం ఉండటంతో, విషయం మొత్తం చెప్పేస్తుంది. మిమ్మల్ని చంపడానికి మీ తల్లి ఇదంతా చేస్తుందని ఆమె చెప్తుంది. చివరికి ఆ తల్లిని పిల్లలు ఏం చేస్తారు? ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతారా? ఆ తల్లి ఎందుకు పిల్లల్ని చంపాలనుకుంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ని చూసేయండి.