BigTV English

Bigg Boss 8 Telugu: సుమ వచ్చారు, గిఫ్ట్స్ తెచ్చారు.. నిఖిల్, అవినాష్‌కు మాత్రమే ప్రత్యేకమైన బహుమతి

Bigg Boss 8 Telugu: సుమ వచ్చారు, గిఫ్ట్స్ తెచ్చారు.. నిఖిల్, అవినాష్‌కు మాత్రమే ప్రత్యేకమైన బహుమతి

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: సీజన్ 8లో చివరిరోజు ప్రేక్షకులను మాత్రమే కాదు.. కంటెస్టెంట్స్‌ను కూడా ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయారు. అందుకే హౌస్‌లోకి యాంకర్ సుమను పంపించారు. బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులో మొదలయినప్పటి నుండి సుమ లేకుండా ఒక్క సీజన్ కూడా గడవలేదు. ప్రతీ సీజన్‌లో ఏదో ఒక విధంగా బిగ్ బాస్ హౌస్‌లో లేదా బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపిస్తూనే ఉన్నారు సుమ. అలా మరొక్కసారి బిగ్ బాస్ 8లో కనిపించారు. తను రావడంతో ఫినాలే టెన్షన్ అంతా మర్చిపోయి రోజంతా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు కంటెస్టెంట్స్. అంతే కాకుండా తన రావడంతో పాటు కంటెస్టెంట్స్‌కు కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు.


సేఫ్ నామినేషన్స్ చేశాను

బిగ్ బాస్ హౌస్‌లోకి రాగానే కంటెస్టెంట్స్‌తో బ్యాక్ టు బ్యాక్ ఆటలు ఆడించారు సుమ. ఒక ఆట పూర్తి అవ్వగానే అందులో గెలిచిన వారికి ఒక గిఫ్ట్స్ అందిస్తానని చెప్పారు. దాంతో పాటు కొన్ని సరదా ఆటలు కూడా ఆడించారు. ముందుగా సరదా ఆటలో భాగంగా కంటెస్టెంట్స్‌ను కొన్ని సరదా ప్రశ్నలు అడిగారు సుమ. అందులో ప్రేరణ ఒకసారి నాలుగు రోజుల వరకు స్నానం చేయలేదనే విషయంతో పాటు నిఖిల్ సేఫ్ నామినేషన్స్ చేశాడని కూడా బయటపడింది. ఆ తర్వాత ఆటలో భాగంగా ప్రేక్షకుల తరపున కంటెస్టెంట్స్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు సుమ. ముందుగా యష్మీతో చనువుగా ఉండడం లవ్ ట్రాక్ కోసమేనా అని గౌతమ్‌ను అడిగారు.


Also Read: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈసారి కూడా..?

యష్మీపై ఆకర్షణ నిజమే

యష్మీపై మొదట్లో ఒక రకమైన ఆకర్షణ కలిగిందని, కానీ తనకు దగ్గరవుతున్న కొద్దీ పర్సనాలిటీ అంతగా నచ్చలేదని అందుకే అక్క అనేశానని ఓపెన్‌గా చెప్పేశాడు గౌతమ్. ఇక నబీల్‌లో ఫైర్ తగ్గిపోయిందని అనగా అలాంటిది ఏమీ లేదని, కొంచెం స్లో అయ్యానని మాత్రం ఒప్పుకుంటానని అన్నాడు. ఎవ్వరితో కలవకపోవడం తన స్ట్రాటజీ కాదని అన్నాడు గౌతమ్. అలా కంటెస్టెంట్స్‌తో మరొక సరదా ఆట ఆడించారు. అందులో నిఖిల్ గెలిచాడు. దీంతో తనకు ఒక స్పెషల్ గిఫ్ట్ లభించింది. తన ఇంటి నుండి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. ఆ వీడియోలో నిఖిల్ తమ్ముడు మాట్లాడుతూ తనను చాలా మిస్ అవుతున్నానని, కచ్చితంగా గెలవాలని కోరుకున్నాడు.

వీడియో మెసేజ్‌లు

ఆ వీడియో మెసేజ్ చూసిన తర్వాత నిఖిల్ కూడా తన తమ్ముడిని మిస్ అవుతున్నానని తెలిపాడు. అవినాష్ కూడా ఒక టాస్క్‌లో గెలవడం వల్ల తనకు కూడా ఇంటి నుండి వీడియో మెసేజ్ వచ్చింది. అది వాళ్ల అమ్మ పంపారు. తాము క్షేమంగా ఉన్నామని, అవినాష్ గెలవాలని దేవుడిని కోరుకుంటున్నామని అన్నారు. కుటుంబం కోసం తను చాలా కష్టపడుతున్నాడని ఎమోషనల్ అయ్యారు. దీంతో అవినాష్ కూడా ఫీలయ్యాడు. ప్రేరణ ఒక టాస్క్‌లో గెలిచినందుకు తనకు ఇంటి నుండి ఫోటో ఫ్రేమ్ వచ్చింది. గౌతమ్ గెలవకపోయినా కూడా తన తల్లి ఫోటో ఫ్రేమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు సుమ. అలా సుమ వచ్చి, అందరితో ఆటలు ఆడించి, స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి వెళ్లారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×