OTT Movie : హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాలు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అడ్వెంచర్ సినిమాలను చివరి వరకు కల్లార్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారు మూవీ లవర్స్. అమ్మాయిలు మాత్రమే ఉండే ఒక దీవిలోని సన్నివేశాలతో ఈ అడ్వెంచర్ సిరీస్ కిక్ ఎక్కిస్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే అడ్వెంచర్ వెబ్ సిరీస్ పేరు “లాప్లే ది హిడెన్ టౌన్” (Laplae The hidden town). ఈ సిరీస్ లో దాదాపు 1000 సంవత్సరాల నుంచి అక్కడ అబ్బాయిలు ఉండరు. ఆడవాళ్లు మాత్రమే ఉంటూ మనుగడ సాగిస్తుంటారు. ఈ మూవీలో అడ్వెంచర్ సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ అడ్వెంచర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ “నెట్ ఫ్లిక్స్” (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక దీవిలో దాదాపు వేయి సంవత్సరాల నుంచి అమ్మాయిలు మాత్రమే నివసిస్తూ ఉంటారు. మగవాళ్లకు ఆ దీవిలో ప్రవేశం ఉండదు. కుటుంబాల అభివృద్ధి కోసం పక్క ఊరిలో ఉన్న ఒక రహస్య ప్రదేశానికి, సంవత్సరానికి 6 మంది చొప్పున గర్భం దాల్చడానికి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు ఆడవాళ్లను మాత్రమే కని తీసుకురావాలి. మగవాళ్లు పుడితే దుష్టశక్తి గా భావించి వాళ్లను అక్కడే చంపేస్తారు. ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ ఊరి పెద్ద ఆ దీవిలోని 6 మంది ఆడవాళ్లను గర్భం దాల్చడానికి, అదీవికి దూరంగా ఉన్న ఒక ప్రాంతానికి తీసుకు వెళ్తూ ఉంటుంది. ఆ ఊరు చాలా దూరం కావడంతో వీరికి దారి చూపడానికి ఒక కీ వీరి వద్ద ఉంటుంది. ఆ కీ వీరికి దారి చూపుతూ ఉంటుంది. ఒక సారి అనుకోకుండా పెద్ద పొగమంచు వీరిని కప్పేస్తుంది. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కీ కాపాడి దారి చూపుతుంది.
ఆ కీని ఎట్టిపరిస్తితుల్లో పోగొట్టుకోకూడదని ఆ ఊరి పెద్ద ఈ అమ్మాయిలకు చెప్తుంది. ఈ క్రమంలో వెళ్లిన వీళ్ళకి ఆ దారిలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వీళ్ళు ఎదుర్కొన్న ఆ సమస్యలు ఏంటి? ఈ ఆడవాళ్లు మళ్లీ గర్భవతులు అవుతారా? మగవాళ్లు ఆ దీవిలోకి ప్రవేశిస్తారా? ఆ కీని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోగలిగారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “లాప్లే ది హిడెన్ టౌన్” (Laplae The hidden town) అడ్వెంచర్ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి. ఈ సిరీస్ చూస్తున్నంత సేపు కల్లార్పకుండా ఎంజాయ్ చేస్తారు. అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమాలలో ఈ మూవీ కూడా ఒకటి. మరి ఎందుకు ఆలస్యం ఈ అడ్వెంచర్ సిరీస్ పై ఓ లుక్ వేయండి.