Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురి కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ వచ్చి వారిని కలిసి సంతోషపెట్టారు. చాలారోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను కలవడంతో కంటెస్టెంట్స్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. కొందరి ఫ్యామిలీస్ మాత్రం బయట నుండి ప్రేక్షకులుగా ఆటను చూస్తున్నారు కాబట్టి తమవారికి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని సూచనలు ఇచ్చి వెళ్లారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో ఫ్యామిలీ వీక్ కాస్త డిఫరెంట్‌గా నడుస్తోంది. కంటెస్టెంట్స్ కోసం వచ్చిన కుటుంబ సభ్యులు కూడా తమకోసం గేమ్స్ ఆడి ఏదో ఒకటి గెలిచి కంటెస్టెంట్స్‌కు గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. అలా అవినాష్ భార్య, యష్మీ ఫాదర్ వచ్చి ప్రైజ్ మనీని పెంచారు.
నిఖిల్ ఓవర్
ముందుగా యష్మీ ఫాదర్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తను రాగానే కంటెస్టెంట్స్ అంతా తనను సరదాగా పలకరించారు. నిఖిల్ అయితే ఏకంగా ఆయన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. అది చూసిన మిగతా కంటెస్టెంట్స్ ఇది మరీ ఓవర్ అని ఫీలయ్యారు. అవినాష్ అయితే యష్మీ ఫాదర్ చూడడానికి చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని, ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడ్డాడు. కానీ ఆయన చాలా కూల్‌గా అందరినీ దగ్గరకు తీసుకున్నారు. అందరితో సరదాగా మాట్లాడారు. అందరితో కబుర్లు చెప్పడం పూర్తయిన తర్వాత యష్మీకి సెపరేట్‌గా కూర్చొబెట్టుకొని సలహాలు, సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా గ్రూప్ గేమ్ ఆడకు అని పదేపదే చెప్పారు.
Also Read: జెడ్ స్పీడ్ లో దూసుకొస్తున్న టేస్టీ తేజ.. సింపథీ వర్కౌట్ అయ్యిందా..?
టాస్కులు ఆడు
కొన్నాళ్ల నుండి గేమ్‌పై యష్మీ ఫోకస్ తగ్గింది. ఎక్కువగా గొడవలు పడడం, అరవడం తప్పా టాస్కుల్లో కూడా తను పెద్దగా గెలవడం లేదు. ఎప్పుడూ నిఖిల్, పృథ్విలతో తిరుగుతూ తనపై ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేసుకుంది. తన తండ్రి కూడా అదే చెప్పారు. గ్రూప్ గేమ్ ఆడొద్దని, టాస్కుల్లో తన పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందని వార్నింగ్ ఇచ్చారు. బయట ప్రేక్షకుల్లో బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని బయటపెట్టారు. ఇన్నాళ్లు కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు తనను విన్నర్‌గా చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చాలావరకు తాను బాగానే ఆడుతున్నానని యష్మీ సమర్థించుకుంది. ఇక వెళ్లే ముందు ఒక టాస్క్ ఆడి ప్రైజ్ మనీకి రూ.21 వేలు యాడ్ చేసి వెళ్లారు యష్మీ ఫాదర్.
ఇద్దరికీ సర్‌ప్రైజ్
ఫ్యామిలీ వీక్ ప్రారంభం అయినప్పటి నుండి కంటెస్టెంట్స్ పెద్దగా టాస్కులు ఏమీ ఆడలేదు. అయినా వారు అలసిపోయినట్టు అనిపిస్తుందని వారికి కాసేపు పడుకోవడానికి టైమ్ ఇచ్చారు బిగ్ బాస్. అదే సమయంలో అవినాష్ భార్య అను సైలెంట్‌గా హౌస్‌లోకి ఎంటర్ అయ్యింది. అందరితో సరదాగా మాట్లాడింది. కానీ పృథ్విని చూస్తే మాత్రం తనకు నామినేషన్స్ గుర్తొస్తాయని చెప్పి నవ్వింది. వారికి యాక్షన్ రూమ్‌లో సెపరేట్‌గా డిన్నర్ ఏర్పాటు చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ సర్‌ప్రైజ్ తను, తన భార్య జీవితాంతం మర్చిపోలేమంటూ ఎమోషనల్ అయ్యాడు అవినాష్. ఇక హౌస్ నుండి బయటికి వెళ్లిపోయే ముందు అవినాష్ భార్య కూడా రూ.51 వేలు గెలిచి ప్రైజ్ మనీలో యాడ్ చేసింది.