BigTV English

OTT Movie : సైకియాట్రిస్ట్ నే కిడ్నాప్ చేసి చుక్కలు చూపించే సైకో… హాలీవుడ్ రేంజ్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : సైకియాట్రిస్ట్ నే కిడ్నాప్ చేసి చుక్కలు చూపించే సైకో… హాలీవుడ్ రేంజ్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఇటీవల కాలంలో ఓటీటీలో మలయాళ సినిమాల సినిమాల సంఖ్య బాగా పెరిగిపోయింది. తెలుగు సినిమాల కంటే ఎక్కువగా మలయాళ సినిమాలే ప్రతివారం ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. అలా తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే..


హాలీవుడ్ రేంజ్ కథ

సినిమా మొత్తం రఘు అనే రైల్వే గేట్ కీపర్ చుట్టూ తిరుగుతుంది. ఆ గేట్ కీపర్ ఎవ్వరూ లేని ఒక ఎడారి లాంటి ప్రాంతాలో రైల్వే గేట్ కీపర్ గా పని చేస్తారు. అక్కడ ఈ వ్యక్తి తప్ప ఒక్క కుక్క కూడా కనిపించదు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ ప్లేస్ ఎలాంటిదో. అలా సోలోగా జీవిస్తున్న గేట్ కీపర్ జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వస్తుంది. నిజానికి మ్యారేజ్ లైఫ్ లో సఫర్ అవుతూ డాక్టర్ గా పని చేస్తుంది ఆమె. తీరా కళ్ళు  తెరిచి చూస్తే ఒక ఎడారి లాంటి ప్రాంతంలో ఉంటుంది. ఎంత అరిచి గీ పెట్టినా ఒక్కరు ఉండరు చుట్టు పక్కల. అసలు హీరోయిన్ ఎక్కడికి ఎలా వచ్చింది? తాను ఒంటరిగా ఉన్నాను అంటూ హీరోయిన్ ను కిడ్నాప్ చేసిన ఆ సైకో ఎవరు? చివరికి హీరోయిన్ తప్పించుకుందా లేదా? అనే విషయాలు తెలియాలంటే లెవెల్ క్రాస్ అనే ఈ సినిమాను చూడాల్సిందే.  సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ లెవెల్ క్రాస్ సినిమా నచ్చుతుంది. సినిమాలోని ట్విస్ట్‌లు మంచి థ్రిల్‌ని ఇస్తాయి. దర్శకుడు అర్ఫాజ్ అయూబ్ ఈ సినిమాను ఎంత జాగ్రత్తగా తెరకెక్కించాడో సినిమాలో కనిపిస్తుంది. థియేటర్లలో మిస్ అయిన వారికి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమా చూసే అవకాశం లభిస్తుంది.


ఓటీటీలోకి ఆసిఫ్ అలీ వరుస సినిమాలు  

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందో. ఈ లెవెల్ క్రాస్ మూవీ. జూలై 26న థియేటర్లలోకివచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో మధ్యాహ్నం 12 గంటలకు సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతోంది. అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ, అమలా పాల్, షరాఫుద్దీన్ ప్రధాన పాత్రలు పోషించారు.

కాగా మలయాళ నటుడు ఆసిఫ్ అలీ వరుస సినిమాలతో ఓటీటీ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గానే ఆయన నటించిన తలవన్, అడియోస్ అమిగో ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పుడు థ్రిల్లర్ మూవీ లెవల్ క్రాస్ కూడా వచ్చేసింది.  మరి మంచి థ్రిల్లింగ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. అలాగే హాలీవుడ్ సైకో కిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి కూడా ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఈ వీకెండ్ డోంట్ మిస్.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×