BigTV English

OTT Movie : అమ్మాయితో అన్న కొడుకు సరసాలు… ఆస్కార్ విన్నింగ్ మూవీ డోంట్ మిస్

OTT Movie : అమ్మాయితో అన్న కొడుకు సరసాలు… ఆస్కార్ విన్నింగ్ మూవీ డోంట్ మిస్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలకు ఆస్కార్ అవార్డులు కూడా వస్తాయి. మంచి కంటెంట్ ఉన్న ఒక ఫ్యామిలీ డ్రామా మూవీలో హీరో నటనకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘మాంచెస్టర్  బై ది సీ‘ (Manchester by the sea) ఈ మూవీలో హీరో తన నటనతో అందరిని మెప్పించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది. మాంచెస్టర్ బై ది సీ మూవీకి కెన్నెత్ లోనెర్గాన్ దర్శకత్వం వహించారు.   ఇందులో కేసీ అఫ్లెక్, మిచెల్ విలియమ్స్, కైల్ చాండ్లర్, లూకాస్ హెడ్జెస్ నటించారు. హీరో సోదరుడు మరణించిన తర్వాత అతని టీనేజ్ మేనల్లుడికి చట్టపరమైన సంరక్షకుడిగా మారిన ఒక వ్యక్తి చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ మూవీ $9 మిలియన్ల బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా $79 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఒక కార్పెంటర్ గా పనిచేస్తుంటాడు. ఇతను ఎప్పుడూ ఏదో విషయంలో బాధపడుతూ ఉంటాడు. ఇతని ప్రవర్తనకి కొంతమంది క్లైంట్స్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. క్లైంట్స్ తో నవ్వుతూ ఉండాలని మేనేజ్మెంట్ చెప్తారు. నా లైఫ్ నా ఇష్టం అంటూ ఒక బార్ లోకి వెళ్లి మందు తాగుతాడు హీరో. అక్కడ ఇతన్ని చూసి నవ్విన ఇద్దరు వ్యక్తులను కొడతాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన అతనికి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. తన అన్న చనిపోయాడని వార్త అందుతుంది. హాస్పిటల్ కి వెళ్లి తన అన్న కొడుకు ప్యాట్రిక్ ని ఓదారుస్తాడు. హీరో అన్నకి ఇదివరకే పెళ్లి అయి ఉంటుంది. ప్యాట్రిక్ తల్లి డ్రగ్స్ కు బానిస అయిపోయి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. పిల్లలు చెడిపోతారని ఆమెకు విడాకులు ఇస్తాడు హీరో అన్నయ్య. మాట్రిక్ ఒంటరి అవడంతో హీరో తన బాగోగులను చూసుకుంటాడు. మొదట అతనిని చూసుకోవడానికి ఆలోచిస్తాడు. అన్నయ్య తన ఆస్తికి హీరోని గార్డియన్ గా పెడతాడు. అయినాగాని ప్యాట్రిక్ ను నేను చూసుకోగలనా అని సందేహిస్తాడు.

ఎందుకంటే హీరోకి తన జీవితంలో ఒక చేదు జ్ఞాపకం ఉంటుంది. ఒకరోజు ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉండగా మందు అయిపోతుంది. దానిని తీసుకొని వచ్చేలోగా ఇల్లు కాలిపోయి, అందులో పిల్లలు చనిపోయి ఉంటారు. తన పిల్లల్ని తానే చంపానని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో హీరో భార్య కూడా హీరోతో విడిపోతుంది. హీరో ఈ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ట్రై చేసినా అది వీలు కాకుండా ఉంటుంది. ప్యాట్రిక్ ఈ క్రమంలో ఒక అమ్మాయి తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్యాట్రిక్ కోసం తను మారాలని అనుకుంటాడు హీరో. అన్నయ్య భార్య, హీరో భార్యకి వేరే పెళ్లిళ్లు అయిపోతాయి. చివరికి హీరో తాను పడే బాధ నుంచి విముక్తి అవుతాడా? పాట్రిక్ కి మంచి భవిష్యత్తు ఇస్తాడా? ఈ విషయాలు  తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : అర్ధరాత్రి ఇంటికొచ్చే మాస్క్ మ్యాన్… క్షణక్షణం భయపెట్టే సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్

Kurukshetra on OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘కురుక్షేత్ర’… ‘మహావతార్ నరసింహా’లాంటి విజువల్ వండర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Movie : రూరల్ టౌన్ లో బ్రూటల్ మర్డర్స్… వేరే లెవెల్ ట్విస్టులు, టర్నులు… చిప్పులు ఎగిరిపోవడం ఖాయం

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

Param Sundari on OTT: ఓటీటీలోకి జాన్వీ కపూర్ 100 కోట్ల రొమాంటిక్ మూవీ… చూడాలంటే కళ్ళు బైర్లుకమ్మే కండిషన్స్

OTT Movie : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు

Big Stories

×