Gundeninda GudiGantalu Today episode December 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు తన చెల్లి పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. రాజేష్ రాగానే ఏంటా రమ్మని పిలిచావంటే పెళ్లికి వెళ్ళడానికి ఒక కారులో ఎలా సరిపోతారు రా నువ్వు వస్తే కాస్త తోడుగా ఉంటుంది కదా అనేసి అంటాడు. బాలు పెళ్ళికొడుకు ను కిడ్నాప్ చేస్తాను అని అనగానే రాజేష్ షాక్ అవుతాడు. మర్డర్ చేయట్లేదు రా కిడ్నాప్ చేస్తానని చెప్తున్నాను అందుకే ఈ డ్రామా అంతా నువ్వు పెళ్లికి రావాల్సిందే ఇప్పుడు అనేసి రాజేష్ అంటాడు. ఇంట్లో అందరూ రెడీ అయ్యి కిందకు వస్తారు.. ప్రభావతి రెడీ అయ్యి కిందకు వస్తుంది. సుశీల నువ్వు కన్నెపిల్ల లాగా రెడీ అవుతుంటే మేము మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాం అన్ని సద్దిపెట్టామనేసి అంటుంది. సత్యం కూడా కిందకి వస్తాడు. బాలు ఏడమ్మా ఇంకా రాలేదు అంటే బాలు అప్పుడే పైనుంచి వస్తాడు. బాలుని చూసి సుశీల అచ్చం మీ తాత లాగే ఉన్నావని మురిసిపోతుంది. ఇక మీనా ను బాలు ఎలా ఉన్నానని అడుగుతాడు. చాలా బాగున్నారు మీలో ఇంత సడన్ మార్పు ఏంటో నాకు అర్థం కావట్లేదని మీనా డౌట్ పడుతుంది.. ఇక ప్రభావతి పెళ్ళిలో ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు అని మాట తీసుకుంటుంది. బాలు నేను ఎవరితోనూ గొడవ పడను అని మాట ఇస్తాడు. ఇక నేను అన్ని అన్నా నా మాట వినరు. నా చెల్లి సంతోషమే నాకు ఇష్టం అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. బాలు హడావిడి పెరిగిపోతుంది. ఇంట్లోనే ఉండిపోతారా? పెళ్లికి టైం అవుతుంది పదండి అని బాలు అనడంతో అంతా బయలుదేరుతారు. అంతా పెళ్లి మండపానికి వెళ్తారు. ఎప్పటిలాగే నీలకంఠం, సంజు చాలా మర్యాదగా నడుచుకుంటారు. కానీ, బాలు గెటప్ చూసి ఆశ్చర్యపోతారు. వీడేంట్రా పెళ్లి అంటే ఇష్టమున్నట్లే ఇంత బాగా రెడీ అయి వచ్చాడు అని నీలకంఠం, సంజు అనుకుంటుంటారు. అది గమనించిన బాలు నీలకంఠం కుటుంబాన్ని కావాలనే పొగుడుతూ ఉంటాడు. వాళ్లు చాలా మంచివాళ్లని, చీమకు కూడా హాని తలపెట్టరని మాట్లాడుతుంటాడు బాలు.. అయితే బాలు వాలకం చూసి షాక్ అవుతారు. ఏదైనా ప్లాన్ చేశాడా? నిజంగానే మారిపోయాడ అని ఆలోచిస్తారు.. కానీ బాలు మాత్రం తన మీద ఎవరికీ అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తుంటాడు.
నిన్నటివరకు ఆ ఫ్యామిలీ అంటేనే పడదు అని అన్నాడు. ఇప్పుడేంటి ఇలాంటి మారాడు అని షాక్ అవుతుంది. ఇక వీడేంటీ ఇన్ని రోజులు వాళ్లు దుర్మార్గులు అన్నాడు. ఇప్పుడేమో తెగ పొగిడేస్తున్నాడు. నిజమేనా లేకపోతే ఇంకేమైనా చేస్తాడా అని ప్రభావతి డౌట్ పడుతుంది. వీడేంట్రా మనల్నీ ఎత్తేస్తున్నాడు అని నీలకంఠం అంటాడు. మనల్నీ చేసేదేం లేదని వాడికి బాగా అర్థమైనట్లుంది. అందుకే ఇలా ప్లేట్ తిప్పేశాడేమో అని సంజు సమాధానం ఇస్తాడు. మరోవైపు మౌనికను చూసి సంజు తల్లి సువర్ణ బాధపడుతుంది.. ఈ అమ్మాయి జీవితాన్ని ఆ దేవుడే కాపాడాలి అని అనుకుంటుంది. బాలు పెళ్లిని ఎలా చెడ గొట్టాలని ఆలోచిస్తాడు. ఈ పెళ్లి ఆగిపోతే బాగుండు అని కోరుకుంటుంది సువర్ణ. పెళ్లి ఏర్పాట్లను మీనా చూసుకుంటూ ఉంటుంది. నీలకంఠం బంధువులకు రోహిణిని, మనోజ్‌ను పరిచయం చేస్తుంది ప్రభావతి. రోహిణి సొంతగా బ్యూటి పార్లర్ నడిపిస్తుందని, వాళ్ల నాన్నకు చాలా దుబాయ్‌లో చాలా ఆస్తులు ఉన్నాయని గొప్పలు పోతుంది ప్రభావతి. మనోజ్ కూడా మంచి జాబ్ చేస్తాడని, మనోజ్ చెప్పిందే ఆఫీస్ లో జరుగుతుందని పెద్ద కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటుంది.
సుశీల వచ్చి రోహిణి వాళ్ల నాన్న గురించి అడుగుతుంది. మీ నాన్న ఇంకెప్పుడు వస్తారు అని అంటుంది సుశీల. దాంతో బిత్తరపోతుంది రోహిణి. ఆలోచించి వర్క్‌లో బిజీగా ఉండి రాలేకపోతున్నారు. ఫ్లైట్ దొరకలేదట అని కవర్ చేస్తుంది రోహిణి. ఇక శ్రుతిపై యాసిడ్ అటాక్ చేసినప్పుడు సంజుతో ఉన్న ఇద్దరు మనుషులను చూసిన మీనా వీళ్లను ఎక్కడో చూసినట్లుందే అని అనుమానిస్తుంది. అయితే గుర్తు పట్టలేదు. ఇక శృతిని పెళ్లికి ఒప్పిస్తాడు రవి.. బాలు సంగతి అమ్మ చూసుకుంటుంది, నాన్న వాళ్ల ముందు బాలు అన్నయ్య ఏం చేయడు అని సర్దిచెబుతాడు రవి. దాంతో చాలా సేపటి తర్వాత మౌనిక పెళ్లి రావడానికి శ్రుతి ఒప్పుకుంటుంది. మరి శృతి నిజం చెప్తుందా? లేక బాలు కిడ్నాప్ చేస్తాడా అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..