BigTV English

OTT Movie : దీవిలో ఒంటరిగా ఉండే తల్లి కూతుర్లు…. దిమ్మతిరిగే ట్విస్టులు ఉండే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : దీవిలో ఒంటరిగా ఉండే తల్లి కూతుర్లు…. దిమ్మతిరిగే ట్విస్టులు ఉండే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది హాలీవుడ్ మూవీస్. ఓటిటి మూవీ లవర్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను చూడటానికి బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందోనని ఆత్రుతగా ఆ మూవీస్ ని ఎంజాయ్ చేస్తారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


హాట్ స్టార్ లో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “ప్రే” (Prey). తండ్రి చనిపోయిన తరువాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన కొడుకుని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి ఒక దీవిలోకి పంపిస్తారు. అక్కడ హీరోకి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈ మూవీ లో ట్విస్టులు చాలానే ఉంటాయి. ప్రస్తుతం ఈ మూవీ హాట్ స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో సెల్ ఫోన్ చూస్తూ ఫోన్ లో ఆడుకుంటుండగా తన తండ్రిని ముసుగు ధరించిన ఒక వ్యక్తి చంపేసి వెళ్ళిపోతాడు. తండ్రి చనిపోవడంతో హీరో డిప్రెషన్ లోకి వెళ్లి పోతాడు. అతని ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ అన్ని డిలీట్ చేస్తాడు. అతన్ని అతని తల్లి  మళ్లీ మామూలు మనిషి కావడానికి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకు వెళుతుంది. ఆ డాక్టర్ ఇలా ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ డిలీట్ చేస్తే ఆ తర్వాత తనను తానే డిలీట్ చేసుకుంటాడు అని అతని తల్లితో చెప్తుంది. ఈ సమస్యకి పరిష్కారం ఇతనిని ఒక దీవిలో ఒక మూడు రోజులు పాటు ఒంటరిగా వదిలేస్తే, ఇతను మళ్లీ మామూలు మనిషి అవుతాడు అని చెప్తుంది. ఈ క్రమంలోనే అతనిని ఒక దీవిలో వదిలేసి వస్తారు. అక్కడ ఇతనికి ఒక ముసుగు ధరించిన వ్యక్తి చీకట్లో కనపడతాడు. అతడు ఎవరో కనుక్కునే లోపే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఇది ఇలా ఉంటే ఆ దీవిలోనే మరొక అమ్మాయి ఆమె తల్లితో కలిసి ఉంటుంది. ఆమె హీరోకి తినడానికి సహాయం చేస్తుంది. ఇంతలో ఆ దీవికి అతన్ని పరీక్షించడానికి సైకాలజిస్ట్ వస్తుంది. ఆమెను ఎవరో ఘోరంగా చంపుతారు. హీరోకి ఆ డాక్టర్ శవం కనబడుతుంది. ఆ షాక్ నుంచి తేరుకుని డాక్టర్ ను చంపింది మీరేనా అని అమ్మాయిని అడుగుతాడు. ఇంతకీ హీరోకి ఆ అమ్మాయి ఏం సమాధానం చెబుతుంది? ఆ దీవిలో ఈ ఫ్యామిలీ ఎందుకు ఉన్నారు? హీరో తండ్రిని చంపిన ఆ ముసుగు మనిషి ఎవరు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. రాత్రిపూట ఒంటరిగా మాత్రం ఈ మూవీని చూడకండి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ మూవీ పై ఓ లుక్ వేయండి.

Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×