BigTV English

OTT Movie : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అత్తామామలను చంపే కోడలు… బుర్ర తిరిగిపోయే మలయాళ మూవీ

OTT Movie : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అత్తామామలను చంపే కోడలు… బుర్ర తిరిగిపోయే మలయాళ మూవీ

OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో మలయాళం మూవీస్ ను చూసే మూవీ లవర్స్ ఎక్కువగానే ఉన్నారు. సింపుల్ స్టోరీని స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ గా, నేచురల్ గా ప్రజెంట్ చేయడంతో ఆ మూవీస్ ని చూసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. థియేటర్లలో రిలీజ్ అయిన ఇలాంటి ఒక మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మంచి టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పేరు “ఉడాల్” (Udaal) ఈ మూవీలో సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి. కోడలు అత్తమామలకు సేవ చేయలేక, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని వాళ్లను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూవీని డైరెక్టర్ అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే…

సైనీ పెళ్లి అయిన తర్వాత తన అత్తగారింటికి వస్తుంది. ఆమె భర్త ఉద్యోగరీత్యా సిటీలో ఉండటంతో, సైని అత్తమామలతో ఇంటి దగ్గరే ఉంటుంది. ఈమెకు ఒక కొడుకు కూడా ఉంటాడు. అత్తకు పెరాలసిస్ రావడంతో మంచానికి పరిమితమై ఉంటుంది. ఆమెకు సేవ చేయడానికి ఒక కేర్ టేకర్ ను కూడా అపాయింట్ చేస్తుంది. అయితే భర్త దూరంగా ఉండడంతో లోటుగా ఫీల్ అయ్యే సైని తన కాలేజీలో పరిచయమైన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అతనితో రోజూ ఏకాంతం గా గడుపుతుంది.  ఒకరోజు కేర్ టేకర్ ఊరికి వెళ్ళి మళ్లీ వస్తాను అని చెప్పి ఊరికి వెళుతుంది. దీంతో అత్తను చూసుకునే బాధ్యత సైనిపై పడుతుంది. ఆమెకు సేవలు చేయలేక చంపడానికి తన బాయ్ ఫ్రెండ్ ని సహాయం అడుగుతుంది. మొదట అతనికి ధైర్యం సరిపోక భయపడతాడు.

ఆతరువాత సైనీ అతనికి ధైర్యం చప్పడంతో, ఆమెను చంపడానికి ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలసి ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపుతారు. ఆ తర్వాత వీళ్లు రూమ్ కి వెళ్ళిపోతారు. టెన్షన్ తగ్గటానికి మరొకసారి ఏకాంతం గా గడుపుతారు. ఈ విషయం ఇంట్లో ఉన్న సైని మామ తెలుసుకుంటాడు. ఇతనికి కళ్ళు సరిగ్గా కనబడవు. మామకు విషయం తెలిసిపోయిందని వీళ్లు కూడా గ్రహిస్తారు. ఇంతలో మామను చంపడానికి కూడా వీళ్లు ట్రై చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న సైని మామ వీళ్ళని ఏం చేస్తాడు? వీళ్ళ అక్రమ సంబంధం కొనసాగుతుందా? చివరికి చేసిన పాపానికి వీరికి శిక్ష పడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఉడాల్” (Udaal) మూవీని తప్పక చూడండి. మూవీ లవర్స్ ఒక థ్రిల్లింగ్ సినిమా చూడాలి అనుకుంటే ఈ మూవీ ని చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×