BigTV English
Advertisement

OTT Movies : ఓటీటీలో బెస్ట్ హారర్ సినిమాలు.. ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోతారు..

OTT Movies : ఓటీటీలో బెస్ట్ హారర్ సినిమాలు.. ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోతారు..

OTT Movies : థియేటర్లలో హారర్ సినిమాలను చూడటం కొందరికి ఇష్టం ఉంటుంది. మరి కొందరు ఇంట్లోనే హారర్ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారి కోసం ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలతో పాటుగా.. పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈమధ్య ఇలాంటి సినిమాలు ఎక్కువగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే దర్శనమిస్తున్నాయి. హారర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కోసం ఇప్పుడు మనం బెస్ట్ హారర్ మూవీస్ ఏవో.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


బర్డ్ బాక్స్..

ఈ మూవీ భయంకరమైన హారర్ సన్నివేశాలతో ఉంటుంది. కంటి చూపుతోనే అవతలి వాళ్ళని చంపేస్తుంది. ఎవరినైతే చంపాలనుకుంటారో వాళ్ళని కంటి చూపుతో చూస్తే అవతలి వాళ్ళు ఆటోమేటిక్ గా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. నగరంలో అలా ఎంతోమంది చనిపోవడం విచిత్రంగా జనాలు కనిపిస్తుంది. ఈ మూవీలో ఊహకందని ఎన్నో ట్విస్టులు కూడా ఉంటాయి. తల్లి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో ఇల్లు వదిలేసి వెళ్తుంది. ఈ క్రమంలో వారు కళ్లకు గంతలు కట్టుకుని నది దాటే ప్రయత్నం చేస్తారు.. మరి వాళ్ళు ఆ గండం నుంచి గట్టెక్కెరా? లేదా వీళ్లు కూడా అందరిలాగే సూసైడ్ చేసుకొని చనిపోయారా? అన్నది స్టోరీ..


ట్రూత్‌ ఆర్‌ డేర్‌..

ట్రూత్ ఆర్ డేర్.. నిజంగా దీన్ని చాలామంది మనలో ఒక ఆటగా ఆడతారు.. ఎక్కువమంది ఉన్నప్పుడు సరదాగా ఉంటుందని ఈ ఆటను ఆడతారు. ఈ సినిమాలో కూడా ఫ్రెండ్స్‌ సరదాగా ట్రూత్‌ ఆర్‌ డేర్‌ ఆడతారు. కానీ ఎవరైనా అబద్ధం చెప్పారంటే ఓ శక్తి వారిని దారుణంగా శిక్షిస్తుంటుంది.. ఆ గేమ్ ను ఆపేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే మూవీ స్టోరీ..

ట్రైన్‌ టు బూసన్‌..

ఇది ఒక కొరియన్ మూవీ. దక్షిణ కొరియాలో జాంబీ వైరస్‌ వ్యాపిస్తుంది. దీంతో ఓ రైలులో మనుషులు ఉన్నట్లుండి జాంబీలుగా మారిపోతారు. అయితే అదే ట్రైన్ హీరో కుటుంబం కూడా ఉంటుంది. ఆ కుటుంబం వారి నుంచి ఎలా బయటపడిందో అన్నది సినిమా స్టోరీ..

స్ట్రేంజర్‌ థింగ్స్‌.. 

టైటిల్ కు తగ్గట్లుగానే ఇది కొత్తగా ఉంటుంది. మనకు తెలియని మరో లోకం ఉందని కొందరు పిల్లలు ఆ లోకాన్ని కనిపెడతారు. అక్కడ రాక్షసులతో పోరాడుతారు. పిల్లలు రాక్షసుల మధ్య ఒక బీకర యుద్ధం జరిగినట్లు ఈ సినిమాలో సన్నివేశాలు కనిపిస్తాయి. అదృశ్య శక్తులున్న ఓ అమ్మాయి ఆ రాక్షస జీవులతో పోరాడేందుకు సాయం చేస్తుంది. నిజానికి ఇది వెబ్ సిరీస్. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది..

మెరైన్‌.. 

ఇందులో ఒక అమ్మాయి హారర్ కథలను రాస్తూ ఉంటుంది. అయితే ఆమె తన కథలలో ఏ స్టోరీ అయితే రాసి ఉంటుందో అదే స్టొరీ నిజజీవితంలో ఎదురవుతుంది. ఇది అస్సలు అమ్మాయి ఊహించి ఉండదు. చివరికి స్టోరీలు ఎలా మారుతాయి. వెబ్ సిరీస్ కి ముగింపు ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ ని తప్పకుండా చూడాల్సిందే..

ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లు అన్నీ కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

Big Stories

×