OTT Movie : ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ, ఒక పాడుబడిన నౌక చుట్టూ తిరుగుతుంది. అందులో దయ్యాలు ఉన్నాయనే పుకారు వ్యాపిస్తుంది. దానిని ఛేదించే క్రమంలో స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా ఒక వైపు భయపెట్టిస్తూ, మరోవైపు సస్పెన్స్ తో ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టిపడేస్తుంది. అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ తో స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘భూత్ : ది హాంటెడ్ షిప్’ (Bhoot : The Haunted Ship). 2020 లో వచ్చిన ఈ మూవీకి భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. దీనిని కరణ్ జోహార్, హిరూ యష్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ సంయుక్తంగా నిర్మించారు. విక్కీ కౌశల్ భూమి పెడ్నేకర్, ఆశుతోష్ రానా ప్రధాన పాత్రల్లో నటించారు. ముంబైలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జుహు బీచ్ లో ఒక పాడుబడిన దెయ్యాల నౌకను తరలించే క్రమంలో ఈ స్టోరీ నడుస్తుంది. 2020 ఫిబ్రవరి 21న ఈ మూవీ థియేట్రికల్ గా విడుదలైంది. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
పృథ్వీ (విక్కీ కౌశల్) ఒక షిప్పింగ్ అధికారిగా ఉద్యోగం చేస్తుంటాడు. ఇతను తన భార్య, కుమార్తెను కోల్పోయి బాధపడుతూ ఉంటాడు. తన డ్యూటిలో భాగంగా ముంబైలోని జుహు బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ‘సీ బర్డ్’ అనే పాడుబడిన ఓడ గురించి తెలుసుకుంటాడు. ఈ ఓడలో ఎవరూ లేరని, అక్కడకు వెళ్లిన వారు ఆశ్చర్యకరంగా అదృశ్యమవుతున్నారని తెలుస్తుంది. పృథ్వీ తన స్నేహితుడు రియాజ్‌తో కలిసి, ఈ ఓడ రహస్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తాడు. ఓడలోకి ప్రవేశించిన హీరో అనేక భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటాడు. ఆ దెయ్యం పృథ్వీని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఓడలో ఉండే దెయ్యం, ఒక చిన్న పాపను బంధించి ఉంచిందని తెలుస్తుంది. ఈ దెయ్యంకు, ఓడలో జరిగిన ఒక విషాదకర సంఘటనకు సంబంధం ఉంటుంది.
ఆ ఓడ కెప్టెన్ దుర్మార్గపు చర్యలే దీనికి కారణం అవుతాయి. కెప్టెన్ భార్య వందన, ఆమె ప్రేమికుడు అమర్ మధ్య జరిగిన గొడవ వల్ల, అమర్ చనిపోయి ఆత్మగా మారతాడు. ఇప్పుడు మీరా అనే పాపను ఆ ఆత్మబంధిస్తుంది. పృథ్వీ తనకు తగిలిన గాయాలను అధిగమిస్తూ, మీరాను రక్షించేందుకు ప్రొఫెసర్ జోషి సహాయంతో ఆత్మతో పోరాడతాడు. అమర్ ఆత్మను ఓడించడానికి పృథ్వీ ఓడలోని అతని శరీరాన్ని దహనం చేస్తాడు. చివరికి ప్రిథ్వీ ఆ పాపను కాపాడతాడా ? అమర్ ఆత్మ ఆ పాపను ఎందుకు బంధిస్తుంది ? ఆ షిప్ లో జరిగిన మిస్టరీ ఏమిటి ? అనే మిస్టీరియస్ అంశాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడండి.
Read Also : పెళ్ళికాని ప్రెగ్నెంట్ అమ్మాయిలే వీడి టార్గెట్ … ఈ సైకో గాడి అరాచకానికి మెంటల్ ఎక్కాల్సిందే