UI Movie OTT: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గతంలో చాలా సినిమాల్లో నటించాడు ఈయన నటించిన సినిమాలన్నీ మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఈమధ్య ఆయన తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషిస్తున్నాడు. తాజాగా ఉపేంద్ర సరికొత్త కథతో ప్రధాని పాత్రలో నటించాడు. ఆ మూవీనే ‘యూఐ ‘.. ఈ మూవీ ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది. కన్నడలో ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ అందుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ ఉపేంద్రకు యూటర్న్ అయిందనే చెప్పాలి. పాజిటివ్ టాక్ ని అందుకోవడం మాత్రమే కాదు భారీగా కలెక్షన్లు కూడా వసూలు చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ సన్ నెక్స్ట్ భారీ ధరకు సొంతం చేసుకుంది.. ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన యూఐ మూవీ డిసెంబర్ 21న థియేటర్లలోకి వచ్చేసి వచ్చింది.. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ యాక్షన్ సినిమా పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కన్నడ లో మాత్రం దున్నెస్తుంది. కలెక్షన్లను బాగానే దక్కించుకుంటోంది. యూఐ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు బయటికి వచ్చాయి.. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ క్రేజీ మూవీకి మంచి రేటే ఓటీటీ హక్కుల ద్వారా వచ్చినట్టు తెలుస్తోంది. జనవరి చివరి వారంలో ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.. మేకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే మూవీని ఓ ఫిక్షనల్ డిఫరెంట్ వరల్డ్ బ్యాక్‍డ్రాప్‍లో ఉపేంద్ర తెరకెక్కించారు. దాదాపుగా తొమ్మిదేళ్ల తర్వాత ఆయన మళ్లీ దర్శకత్వంలోకి దిగారు. ఈ మూవీలో మూడు పాత్రల్లో ఉపేంద్ర నటించారు. ఈ చిత్రంలో రేష్మా నన్నయ్య, మురళీ శర్మ, కేవీ అనుదీప్, సాధు కోకిల, వినాయక్ త్రివేది, ఇంద్రజిత్ లంకేశ్, నిధి సుబ్బయ్య, ఓం సాయి ప్రకాశ్ తదితరులు నటించారు. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ఇక ఈరోజు కూడా కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్లపై జీ మనోహరన్, శ్రీకాంత్, భూమిక గొండాలియా ప్రొడ్యూజ్ చేశారు. అజ్నీశ్ లోక్‍నాథ్ సంగీతం అందించారు. సమాజంలో ఉన్న కొన్ని కఠిన నిజాలను చూపించారు. కొంతమంది జనాలకు నచ్చింది. మరి కొంతమందికి ఈ మూవీ కథ నచ్చలేదని టాక్. ఏదైతేనెం ఈ మూవీ ఉపేంద్రకు కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి..