BigTV English

Paneer Gulabjamun: పనీర్‌తో ఇలా గులాబ్ జామున్ చేసేయండి, రుచి కొత్తగా అదిరిపోయేలా ఉంటుంది

Paneer Gulabjamun: పనీర్‌తో ఇలా గులాబ్ జామున్ చేసేయండి, రుచి కొత్తగా అదిరిపోయేలా ఉంటుంది

గులాబ్ జామూన్‌లు అంటే ఎంతో మందికి ఇష్టం. ఎప్పటిలాగే బయట దొరికే రెడీ టు మిక్స్ పొడితోనే గులాబ్ జామూన్‌లు చేస్తే వాటి అసలైన రుచిని మీరు మిస్ అవుతారు. ఇక్కడ మేము టేస్టీ పనీర్ గులాబ్ జామ్ రెసిపీ ఇచ్చాము. బ్రెడ్ జామున్, మిల్క్ పౌడర్ తో చేసే గులాబ్ జామూన్ కన్నా కూడా ఈ పనీర్ గులాబ్ జామూన్ చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెడితే చాలు కరిగిపోయేలా ఉండే ఈ గులాబ్ జామూన్ పిల్లలకు, పెద్దలకు నచ్చుతుంది. పండగల సమయాల్లో ఇంట్లో స్వీట్ చేయాలనుకుంటే ఈ పనీర్ గులాబ్ జామ్ చేసేందుకు ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.


పనీర్ గులాబ్ జామ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పనీర్ ముక్కలు – ఒక కప్పు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
వంట సోడా – చిటికెడు
మైదా – మూడు స్పూన్లు
నీరు – సరిపడినంత
చక్కెర – ఒక కప్పు

పనీర్ గులాబ్ జామూన్ రెసిపీ


  • ముందుగా చక్కెర పాకాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి.
  • ఇందుకోసం స్టవ్ మీద గిన్నె పెట్టి నీరు చక్కెర వేసి పది నిమిషాలు పెద్ద మంటపై ఉడికించండి.
  • అంతే పంచదార సిరప్ రెడీ అయిపోతుంది.
  • ఇప్పుడు పనీర్ ను సన్నగా తురమండి. తురిమిన తర్వాత దాన్ని చేత్తోనే మెత్తగా మెదపండి.
  • ఆ గిన్నెలో ఉన్న పనీర్‌లో మైదా పిండి, బేకింగ్ సోడా వేసి పిండిలాగా చేత్తోనే గట్టిగా కలుపుకోండి.
  • తర్వాత  వీటిని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టండి. మీకు గులాబ్ జామూన్ ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకోండి.
  • ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి ఆ నూనె వేడెక్కాక ఈ పనీర్ తో చేసిన చిన్న లడ్డూలను అందులో వేసి వేయించండి.
  • అవి గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి. తర్వాత వాటిని తీసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా పంచదార సిరప్ లో వేసి గంటపాటు వదిలేయండి.
  • ఈ గులాబ్ జామూన్ పంచదార పాకాన్ని బాగా పీల్చుకుని మెత్తగా అవుతాయి. వీటిని చూస్తుంటేనే నోరూరిపోతుంది.

Also Read: చిక్కుడుకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే నోరూరిపోయేంత టేస్ట్!

పనీర్‌తో చాలా రకాల వంటకాలు చేయొచ్చు. పనీర్‌తో చేసిన ఏ వంటకమైనా టేస్టీగా ఉంటుంది. అలాగే పనీర్ గులాబ్ జామ్ కూడా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి దీన్ని ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ గులాబ్ జామూన్ చేసేందుకు పనీర్‌ను క్యూబ్స్ రూపంలోనే తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద ముక్క రూపంలో తీసుకొని చాకుతోనే సన్నగా తరిగి చేత్తోనే మెత్తగా మెదుపుకోవచ్చు. లేదా మిక్సీలో వేసి ఒకసారి తిప్పినా కూడా అది ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి పనీర్ తో గులాబ్ జామ్ చేయడం అనేది చాలా సులువు. మరింత టేస్ట్ కోసం కాస్త చిటికెడు యాలకుల పొడి వేసుకుంటే ఘుమఘమలాడడం ఖాయం. దీపావళి, దసరా, సంక్రాంతి వంటి సమయాల్లో ఇంటికి వచ్చే అతిధులకు ఈ పనీర్ గులాబ్ జామూన్ వండి వడ్డించండి. వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×