BigTV English

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : దెయ్యం కథలు అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. ఒకప్పుడు కథల రూపంలో పెద్ద వాళ్ళు పిల్లలకు చెప్పేవాళ్ళు. ఆ తరువాత చందమామ కథల్లో చదవడం మొదలెట్టారు. ఇక కాలం మారుతున్న కొద్దీ సినిమాలు, టివిలలో వీటిని చూసి తరిస్తున్నారు. మొత్తానికి ఈ కథల ధ్యేయం ఒక్కటే, అది ప్రేక్షకులను భయపెట్టడం. ఇక అసలు విషయానికి వస్తే, ఒక తుర్కిష్ హారర్ సినిమా ఆడియన్స్ ని తెగ భయపెడుతోంది. ఈ కథ నలుగురు ఫ్రెండ్స్, ఒక శాపం వల్ల భయంకర దెయ్యంను ఫేస్ చేస్తారు. ఇక వణుకు పుట్టించే సీన్లతో ఈ కథ నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘బెద్దువా: ది కర్స్’ (Beddua: The Curse) 2018లో వచ్చిన తుర్కిష్ హారర్ సినిమా. దర్శకుడు అల్పర్ మెస్త్చి దీనిని తెరకెక్కించారు. మెయిన్ క్యారెక్టర్స్లో మెలెక్, బుర్కు, ఎడా, అయ్లా నటించారు. ఈ సినిమా 2018 జూన్ 14న థియేటర్లలో వచ్చింది. 1 గంట 30 నిమిషాల నిడివితో IMDb లో 5.9/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది.

కథలోకి వెళ్తే

మెలెక్, బుర్కు, ఎడా, అయ్లా అనే నలుగురు అమ్మాయిలు స్కూల్ ఫ్రెండ్స్. చాలా క్లోజ్ గా ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఒక రోజు వాళ్లు హావెల్ అనే అమ్మాయిని కలుస్తారు. హావెల్ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. వాళ్లు ఆమెతో ఒక గేమ్ ని ఆడతారు. అది ఒక శాపాన్ని స్టార్ట్ చేస్తుంది. ఈ శాపం ఒక బలమైన దెయ్యాన్ని బయటికి రప్పిస్తుంది. ఆ దెయ్యం వచ్చినప్పుడు ఆకాశంలో డార్క్ క్లౌడ్స్ కనిపిస్తాయి. ఇక ఆ దెయ్యం వాళ్లను వేటాడటం స్టార్ట్ చేస్తుంది. వాళ్ల లైఫ్ అంతా భయంకర సీన్స్ తో మారిపోతుంది. ఇప్పుడు విచిత్రమైన డ్రీమ్స్, యాక్సిడెంట్స్ మొదలవుతాయి. ఆ నలుగురూ ఒక్కొక్కరు దెయ్యం వల్ల భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దెయ్యం వాళ్లను బాగా భయపెడుతుంది.


ఈ అమ్మాయిలు, ఆ ఈ శాపం గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అది హావెల్‌తో కనెక్ట్ అయి ఉందని తెలుస్తుంది. హావెల్ ఒక మామూలు అమ్మాయి కాదు, ఆమె ఒక మంత్రగత్తె. కానీ వాళ్లు ఏ తప్పూ చేయకపోయినా ఆమె వల్ల శాపం వచ్చింది. వాళ్లు కలిసి ఈ శాపాన్ని బ్రేక్ చేయడానికి మార్గాలు వెతుకుతారు. కానీ దెయ్యం వాళ్లను వేరు చేయడానికి ట్రై చేస్తుంది. సినిమా భయం, సస్పెన్స్‌తో నడుస్తుంది. వాళ్లకు ఈ శాపం హావెల్‌తో చేసిన గేమ్ వల్ల వచ్చిందని తెలుస్తుంది. ఈ దెయ్యం వాళ్లను పగ తీర్చుకోవడానికి వాడుతుంది. వాళ్లు కలిసి ఒక రిచ్యువల్ తో దెయ్యాన్ని ఎదుర్కొంటారు. క్లైమాక్స్‌లో దెయ్యం అటాక్స్ వల్ల వచ్చే భయంకర సీన్స్ తో, ఈ సినిమా ఒక డార్క్ ఎండింగ్‌తో ముగుస్తుంది. ఈ అమ్మాయిలు ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేస్తారా ? దెయ్యం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? దీనికి ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ తుర్కిష్ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఫ్యామిలీని వెంటాడే శాపం… ఆ సమయంలో చావు మరింత భయంకరం… ఇదెక్కడి క్రేజీ స్టోరీ మావా

Related News

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

Big Stories

×