Romantic Series on OTT : నవలల ఆధారంగా తెరకెక్కుతున్న సిరీస్‌లకు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిలో కూడా బోల్డ్ కంటెంట్ ఉన్న సిరీస్ లు దుమ్ము లేపుతున్నాయి కూడా. ఈ మధ్య వచ్చిన ‘బ్రిడ్జర్టన్’ సిరీస్ సెన్సేషన్ అయింది కూడా. ఇప్పుడు ఓటీటీలోకి మరో బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చేసింది. రొమాంటిక్ సీన్లతో ఇది పిచ్చెక్కిస్తోంది. ప్రముఖ రచయిత్రి ఎల్ కెన్నెడీ రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ పేరు ‘ఆఫ్ క్యాంపస్’. దీని ట్రైలర్ చూస్తేనే దీన్ని ఎంత బోల్డ్ గా తెరకెక్కించారో తెలుస్తోంది. ఇక రొమాంటిక్ ప్రియులు కూడా ఈ సిరీస్ కోసం బాగానే ఎదురు చూశారు. ఇప్పుడు కళ్ళారా చూసి ఆనందిస్తున్నారు. ట్రయాంగిల్ ప్రేమతో ఈ స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.
‘ఆఫ్ క్యాంపస్’ (Off campus) రొమాంటిక్ వెబ్ సిరీస్ సీజన్ 1 మే 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హన్నా వెల్స్‌గా ఎల్లా బ్రైట్, గారెట్ గ్రాహమ్‌గా బెల్మాంట్ కెమెలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఇది 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు సీజన్ 1 విడుదల కాకముందే రెండో సీజన్‌ను కూడా ప్రకటించేశారు మేకర్స్. ఈ సిరీస్‌ను ప్రైమ్ వీడియో తరపున లూయిసా లెవీ, గినా ఫాటోర్ కలసి రూపొందించారు. గతంలో ‘ట్విలైట్’, ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ‘టెంపుల్ హిల్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
గారెట్ కాలేజీ ఐస్ హాకీ జట్టుకు కెప్టెన్. ఆటలో తోపైనా చదువులో మాత్రం వెనకబడి ఉంటాడు. కాలేజీ రూల్స్ ప్రకారం జట్టులో కొనసాగాలంటే వాడు ఒక ముఖ్యమైన పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదే కాలేజీలో హన్నా అనే చురుకైన మ్యూజిక్ స్టూడెంట్ ఉంటుంది. ఆమెకు కాలేజీలో ఒక అబ్బాయిపై క్రష్ ఉంటుంది. అయితే అతను ఈమెను అస్సలు పట్టించుకోడు. ఆ పరీక్షలో హన్నాకు టాప్ మార్కులు రావడంతో, ఎలాగైనా తనకు ట్యూషన్ చెప్పమని గారెట్ ఆమెను బ్రతిమాలుతాడు.
మొదట్లో హన్నా దీనికి ఒప్పుకోదు. దీంతో గారెట్ ఆమెకు ఒక ఉపాయం చెప్తాడు. ఇద్దరూ కలిసి కాలేజీలో ప్రేమికుల్లా నటిద్దామని, అది చూసి హన్నా క్రష్ కి అసూయ కలిగి ఆమె వైపు వస్తాడని డీల్ మాట్లాడుకుంటారు. దానికి బదులుగా హన్నా తనకు చదువు చెప్పాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ప్లాన్ ప్రకారం కాలేజీలో ఇద్దరూ జంటగా తిరగడం మొదలుపెడతారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ, ఆ నకిలీ ప్రేమ కాస్తా నిజమైన గాఢమైన ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే మిగతా కథ. దీన్ని ప్రేమికులు చూస్తే మాత్రం మస్త్ మజా ఉంటుంది.
Read Also : వారానికి ఒకసారి వచ్చే ఏకాంత సమయం… పెళ్ళి తర్వాత కూడా పక్క చూపులు… అన్నీ అలాంటి సీన్లే