Psych Siddhartha OTT : కొత్త సినిమాలు మంచి బజ్ తో థియేటర్లలోకి వస్తే చాలు, ఓటీటీలు వాటికి అదిరిపోయే డీల్స్ తో ముందుకు వస్తాయి. చాలా సినిమాలకు రిలీజ్ కు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఒప్పందం జరుగుతుంది. కానీ మూవీ రిలీజ్ అయ్యాకే మూవీ ఓటీటీ పార్టనర్ ఎవరన్నది బయట పడుతుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ‘సైక్ సిద్ధార్థ’ అనే మూవీ ఏ ఓటీటీలోకి రాబోతోంది అన్న విషయం బయటకు వచ్చింది. మరి బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ పెదవి విరిచేలా చేసిన ఈ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ ? ఎప్పుడు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
తెలుగు చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ (Psych Siddhartha) నిన్న థియేటర్లలోకి వచ్చి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ డ్రామాలో శ్రీ నందు ప్రధాన పాత్ర పోషించాడు. మూవీలో పెద్దలకు మాత్రమే అనే కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కంటే, యూత్ కే ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంది. మూవీ టాక్ చూశాక దీన్ని థియేటర్లలో కంటే ఓటీటీలో చూడాలనే వెయిటింగ్ లో ఉన్నారు చాలామంది. వాళ్ళ కోసమే గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా తెలుగు ఓటీటీనే ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ కానుందనే సమాచారం వచ్చింది. ఆహా (Aha) ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. డిజిటల్ రిలీజ్ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కానీ సినిమాలు బిగ్ స్క్రీన్ పైకి వచ్చిన నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. డిజాస్టర్ అయితే అంతకంటే ముందే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రెబెక్కా శ్రీనివాస్, సుఖేష్, వాడేకర్ నర్సింగ్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. శ్రీ నందు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు అదనపు స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మాతగా వ్యవహరించగా, స్మరన్ సాయి సంగీతం సమకూర్చారు.
Read Also : పెళ్లయ్యాక భార్య అమ్మాయి కాదని తెలిస్తే… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ భయ్యా
సిద్ధార్థ (శ్రీ నందు) తన ప్రేయసి చేసిన మోసంతో డిస్టర్బ్ అయ్యి ఉంటాడు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి లాభాలు మూటగట్టుకుందాం అని మాయ మాటలు చెప్పి మన్సూర్ మోసం చేస్తాడు. మరోవైపు క్లబ్ లో చూసి తాను ఇష్టపడ్డ ప్రియురాలు త్రిష (ప్రియాంక రెబెకా శ్రీనివాస్) కూడా అతన్ని వదిలేస్తుంది. నిజానికి సిద్ధూ ఈ అమ్మాయి కోసమే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. పైగా అందులో ఆమె కూడా ఒక పార్టనర్. అయితే హీరోకి తెలియకుండా త్రిష, మన్సూర్ రిలేషన్షిప్ లో ఉంటారు. అతని డబ్బుతోనే బిజినెస్ స్టార్ట్ చేసి, చివరికి అతన్నే బయటకు గెంటేస్తారు. ఇక త్రిష హీరోని వదిలేసి మన్సూర్‌తో కలిసి ఉంటుంది. ఈ షాకింగ్ ఘటనతో కలత చెందిన సిద్ధార్థ తనను తాను ప్రపంచం నుండి దూరం చేసుకుంటాడు. ఇంతలో భర్త ఎప్పుడూ టార్చర్ పెడుతుండటంతో శ్రావ్య అనే మహిళ (యామిని భాస్కర్) అతన్ని విడిచిపెట్టి, సిద్ధూ ఉంటున్న అదే బస్తి బిల్డింగ్ లో ఉంటుంది. ఒక ఊహించని సంఘటన వారిని ఒకచోట చేర్చుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? వాళ్ళ గతాలు వారి వర్తమానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి ? అనేది మిగిలిన కథ.