E-Paper
Advertisement

95 ఏళ్ల తాత చివరి కోరిక కోసం పాక్ కు మనవడు… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

95 ఏళ్ల తాత చివరి కోరిక కోసం పాక్ కు మనవడు… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్
Advertisement

Emotional Drama On OTT : కొన్ని ప్రేమకథలు కాలంతో ముగిసిపోవు… దశాబ్దాలు గడిచినా మనసులో చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఒకవేళ అలాంటి ప్రేమను దేశ సరిహద్దులే విడదీస్తే ? 78 ఏళ్ల తర్వాత కూడా ఆ జ్ఞాపకమే ఓ వృద్ధుడిని వెంటాడితే ? ఆ అసంపూర్ణ ప్రేమకథకు ముగింపు పలకాలని ఓ మనవడు నిర్ణయించుకుంటే ? అలాంటి హృదయాన్ని కదిలించే కథతో తెరకెక్కిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామానే ‘మై వాపస్ ఆవుంగా’ (Main Vaapas Aaunga). దర్శకుడు ఇంతియాజ్ అలీ తనదైన స్టైల్ లో భావోద్వేగ కథనంతో, ఎ.ఆర్. రెహమాన్ సంగీతంతో ఈ చిత్రాన్ని మరింత హార్ట్ టచింగ్ గా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

స్టాండప్ కమెడియన్‌గా పేరు సంపాదించాలని కలలు కనే ఓ యువకుడు, డిమెన్షియాతో బాధపడుతున్న తన తాతయ్యను చూసుకోవడానికి అతని దగ్గరకు వస్తాడు. వృద్ధాప్యంతో పాటు జ్ఞాపకశక్తి కోల్పోతున్న తాతయ్య తరచూ ఒకే పేరును పలుకుతూ, 1947లో తన జీవితంలో జరిగిన విషాద ప్రేమకథను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ మాటల్లోని బాధను గమనించిన మనవడు, ఆయన మనసులో ఎన్నేళ్లుగా దాగి ఉన్న గాయాన్ని నయం చేయాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

ఆ అన్వేషణలో భాగంగా తాతయ్య గత జీవితాన్ని తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. కథ క్రమంగా 1947 దేశ విభజన కాలానికి వెళ్లిపోతుంది. అప్పట్లో యువకుడైన తాతయ్య ఒక యువతిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని కలలు కంటారు. కానీ ఒక్కసారిగా దేశ విభజన కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.

అల్లర్లు, మత ఘర్షణలు, వలసలు, సరిహద్దుల మార్పులు వారి ప్రేమను కూడా దూరం చేస్తాయి. ప్రాణాలు కాపాడుకోవడం కోసం రెండు కుటుంబాలు రెండు దేశాల వైపు వెళ్లిపోవాల్సి వస్తుంది. ఒకరిని ఒకరు వెతకడానికి అవకాశం కూడా లేకుండా పరిస్థితులు వారిని శాశ్వతంగా విడదీస్తాయి. అయినప్పటికీ ఆ ప్రేమ మాత్రం ఇద్దరి మనసుల్లో ఎప్పటికీ చెరగదు.

Advertisement

ప్రస్తుత కాలంలో మనవడు ఆ అసంపూర్ణ ప్రేమకథకు ముగింపు పలకాలని ప్రయత్నిస్తాడు. పాత లేఖలు, జ్ఞాపకాలు, కుటుంబ రహస్యాలు వెతుకుతూ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయాణంలో ఎన్నో భావోద్వేగ క్షణాలు, ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడతాయి. చివరికి తాతయ్య తన మొదటి ప్రేమను మరోసారి కలుసుకున్నాడా ? దేశ విభజన వల్ల విడిపోయిన ఆ ఇద్దరి ప్రేమకు చివరకు పూర్తి ముగింపు దొరికిందా ? మనవడు తన తాతయ్య చివరి కోరికను నెరవేర్చగలిగాడా ? అనే భావోద్వేగ మలుపులతో సినిమా ముగుస్తుంది.

తెలుగులో అందుబాటులో ఉందా ?

దేశ విభజన నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రేమ, జ్ఞాపకాలు, కుటుంబ బంధాలు, కాలం విలువను హృదయానికి హత్తుకునేలా చూపించారు. ఇంతియాజ్ అలీ భావోద్వేగ కథనం, దిల్‌జిత్ దోసాంజ్ నటన, నసీరుద్దీన్ షా హార్ట్ టచింగ్ రోల్, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్. ‘మై వాపస్ ఆవుంగా’ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం హిందీ ఒరిజినల్ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. అయితే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. ఎమోషనల్ లవ్ స్టోరీలు, దేశ విభజన నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాలు చూడాలనుకుంటే ఈ వీకెండ్ కు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రేమకు కాలం, సరిహద్దులు అడ్డుకావని భావోద్వేగంగా చెప్పే ఈ చిత్రం చివరి వరకు మనసును కదిలిస్తూ, ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది.

Read Also: చనిపోయిన వాళ్లు అర్ధరాత్రి మీటింగ్ పెడితే… ‘స్ట్రేంజర్ థింగ్స్’లాంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

Tags

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×