E-Paper
Advertisement

పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు

పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు
Advertisement

Malayalam Comedy Thriller on OTT : ఒక గ్రామం… ఒక పాత కుటుంబం… ఎక్కడో పాతిపెట్టిన కోట్ల విలువైన లంకె బిందెలు. ఆ నిధి గురించి ఓ వార్త బయటకు రావడంతో ప్రశాంతంగా ఉన్న ఊరు ఒక్కసారిగా యుద్ధభూమిగా మారిపోతుంది. బంధువులు శత్రువులుగా మారడం, గ్రామస్థులంతా నిధి కోసం వేట ప్రారంభించడం, ప్రతి అడుగులో కొత్త ట్విస్టులు రావడం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. కామెడీ, మిస్టరీ, సస్పెన్స్‌ను కలిపి తెరకెక్కిన మలయాళ చిత్రం ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ (Sathyathil Sambhavichathu). ఈ కామెడీ విలేజ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ ట్రెజర్ హంట్ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి ? ఏ ఓటీటీలో ఈ సినిమాను చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

అగస్తికుమార్ (ఆకాష్ మీనన్) విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే తన తాతయ్య పక్షవాతంతో మంచాన పడిపోవడంతో అతను స్వగ్రామానికి తిరిగి రావాల్సి వస్తుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చిన అగస్తికి ప్రశాంతమైన జీవితం దొరుకుతుందని అనుకుంటాడు. కానీ అక్కడ అతడి కోసం ఎదురు చూస్తున్నది మాత్రం కుటుంబ ఆస్తి వివాదాలు, బంధువుల మధ్య గొడవలు.

Advertisement

తాతయ్య ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి కోసం పోటీ మరింత పెరుగుతుంది. ఇదే సమయంలో అగస్తికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. తన తాతయ్య చాలా సంవత్సరాల క్రితం తమ భూమిలో ఎక్కడో ఒకచోట విలువైన నిధిని దాచిపెట్టాడనే రహస్యం బయట పడుతుంది. అయితే ఆ నిధి ఎక్కడ ఉందో చెప్పే స్పష్టమైన ఆధారాలు మాత్రం ఎవరికీ తెలియవు.

ఆ నిధి గురించి మొదట కొద్దిమందికే తెలిసినా, కొంతకాలానికే ఆ వార్త గ్రామం మొత్తం వ్యాపిస్తుంది. దీంతో ప్రశాంతంగా ఉన్న ఊరు ఒక్కసారిగా నిధి వేటలో మునిగిపోతుంది. ఎవరికివారు పాత బావులు, పొలాలు, చెరువుల దగ్గర తవ్వకాలు మొదలుపెడతారు. కొందరు పాత మ్యాపులు వెతుకుతుంటే, మరికొందరు జ్యోతిష్యులు, మాంత్రికులను కూడా ఆశ్రయిస్తారు. ఈ ప్రయత్నాలన్నీ ఊరిలో వరుసగా నవ్వులు పూయించే పరిస్థితులను సృష్టిస్తాయి.

Advertisement

అగస్తి మాత్రం తొందరపడకుండా తాతయ్య వదిలిన చిన్న చిన్న క్లూస్‌ను కలిపి నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రతి ఆధారం అతన్ని మరో కొత్త రహస్యం దగ్గరకు తీసుకెళ్తుంది. ఆస్తి కోసం ఆశపడుతున్న కొందరు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది.

సెకండాఫ్‌లో కథ పూర్తిగా మిస్టరీ థ్రిల్లర్‌గా మారుతుంది. నిధి కోసం జరిగే పోటీ వెనుక కొన్ని ఊహించని నిజాలు బయటపడతాయి. చివరికి అగస్తి నిజంగా ఆ లంకె బిందెలను కనుగొన్నాడా ? తాతయ్య దాచిన నిధి వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి ? అది సంపదేనా లేక మరేదైనా ఊహించని నిజమా? అనే ప్రశ్నలకు సమాధానాలే సినిమా క్లైమాక్స్‌.

తెలుగులో ఉందా ?

ఈ సినిమాను సాధారణ ట్రెజర్ హంట్ కథలా కాకుండా, గ్రామీణ నేపథ్యం, కామెడీ, మిస్టరీ, సస్పెన్స్ అంశాలను మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. చివర్లో వచ్చే ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ‘సత్యత్తిల్ సంభవిచ్చతు’ Sun NXT ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మలయాళ ఒరిజినల్ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదా తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో వీక్షించే అవకాశం ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిస్టరీ థ్రిల్లర్లు, ట్రెజర్ హంట్ కథలు, కామెడీ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడవచ్చు. నవ్వులు పంచుతూనే చివరి వరకు సస్పెన్స్‌ను కొనసాగించే ఈ మలయాళ చిత్రం ఒక డిఫరెంట్ మూవీ ఫీల్ ని అందిస్తుంది.

Read Also: యాక్సిడెంట్ తో ప్రియురాలిని మర్చిపోయే ప్రియుడు… ఎక్స్ లవర్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×