E-Paper
Advertisement

చికెన్ అంటే ఇష్టమా?… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే షాకింగ్ డాక్యుమెంటరీ

చికెన్ అంటే ఇష్టమా?… నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే షాకింగ్ డాక్యుమెంటరీ
Advertisement

Investigative Documentary on OTT : మనం ఇష్టంగా తినే ఫ్రైడ్ చికెన్ నిజంగా ఎంత వరకు సురక్షితం ? ఆ రుచికరమైన ముక్క వెనుక కోట్ల రూపాయల కార్పొరేట్ వ్యాపారం, ప్రమాదకరమైన రసాయనాలు, అమానుష కార్మిక పరిస్థితులు, జంతువులపై జరుగుతున్న దారుణాలు దాగి ఉంటే ? అలాంటి షాకింగ్ నిజాలను బయట పెట్టేందుకు ఓ ప్రముఖ కమెడియన్ తన శరీరాన్నే ప్రయోగశాలగా మార్చుకుని చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ‘బిగ్ చికెన్: ఎ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ’ (Big Chicken: A Fast Food Conspiracy). ఆరోగ్యం, ఫుడ్ ఇండస్ట్రీ, కార్పొరేట్ వ్యవస్థల గురించి కళ్లుచెదిరే నిజాలను చూపించే ఈ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. మరి ఈ డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో అవైలబుల్ గా ఉందో చూద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజూ ఫాస్ట్ ఫుడ్ చికెన్‌ను ఎలాంటి సందేహం లేకుండా తింటుంటారు. కానీ ఆ చికెన్ తయారీ వెనుక అసలు ఏం జరుగుతోంది ? కంపెనీలు నిజంగా వినియోగదారుల ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నాయా ? అనే ప్రశ్నలకు సమాధానం వెతకడానికే ఈ డాక్యుమెంటరీ రూపొందింది.

Advertisement

ప్రముఖ బ్రిటీష్ కమెడియన్ మో గిల్లిగన్ ఒక సాహసోపేతమైన ప్రయోగానికి సిద్ధమవుతాడు. వరుసగా 28 రోజుల పాటు రోజుకు మూడు పూటలా కేవలం ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ చికెన్ మాత్రమే తింటూ, అది తన శరీరం, మానసిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో స్వయంగా పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంటాడు. బ్రిటన్, అమెరికాలోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్లను సందర్శిస్తూ ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తాడు.

మొదట్లో సాధారణంగానే కనిపించిన ఈ ప్రయోగం రోజులు గడిచేకొద్దీ భయంకరమైన మలుపు తిరుగుతుంది. అతనిలో శారీరక అలసట, బరువు మార్పులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారం మనిషి శరీరాన్ని మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తుందో వైద్య నిపుణులు వివరించే అంశాలు ఆలోచింపజేస్తాయి.

Advertisement

అంతటితో ఆగకుండా, ఫాస్ట్ ఫుడ్ చికెన్‌కు ప్రత్యేకమైన రుచి తీసుకురావడానికి ఉపయోగించే రసాయనాలపై కూడా ఈ డాక్యుమెంటరీ దృష్టి పెడుతుంది. కొన్ని చట్టపరమైన లోపాలను ఉపయోగించుకుని కంపెనీలు అనుమానాస్పద పదార్థాలను ఎలా వినియోగిస్తున్నాయో, ఆ ప్రక్రియపై నిపుణుల అభిప్రాయాలను కూడా ఇందులో చూపిస్తారు.

మరోవైపు భారీ చికెన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికుల పరిస్థితిని కూడా ఈ చిత్రం వెలుగులోకి తీసుకొస్తుంది. ఎక్కువ గంటలపాటు విరామం లేకుండా పని చేయాల్సిన పరిస్థితులు, వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కొన్ని సంస్థలపై వచ్చిన కార్మిక దోపిడీ ఆరోపణలు వంటి అంశాలు ప్రేక్షకులను కలచివేస్తాయి.

అదే సమయంలో ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ కోసం కోళ్లను అత్యంత వేగంగా పెంచే విధానాలు, వాటి ఆరోగ్యంపై పడే ప్రభావం, జంతు సంక్షేమానికి సంబంధించిన ప్రశ్నలను కూడా ఈ డాక్యుమెంటరీ ప్రస్తావిస్తుంది. దీంతో ఇది కేవలం ఫుడ్ గురించి చెప్పే డాక్యుమెంటరీగా కాకుండా, మనం ప్రతిరోజూ తినే ఆహారపు అలవాట్ల గురించి ఆలోచించేలా చేసే ఇన్వెస్టిగేటివ్ జర్నీగా మారుతుంది.

తెలుగులో అందుబాటులో

ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ వెనుక ఉన్న వ్యాపార విధానాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, కార్పొరేట్ వ్యవస్థల పనితీరు గురించి ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన డాక్యుమెంటరీ ఇది. నిజ జీవిత ప్రయోగం, నిపుణుల విశ్లేషణలు, షాకింగ్ ఫ్యాక్ట్స్, కళ్లకు కట్టినట్లు చూపించిన ఇన్వెస్టిగేషన్ ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా నిలబెడతాయి. ‘బిగ్ చికెన్: ఎ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. భారతదేశంలో ఈ డాక్యుమెంటరీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం ఆడియోలతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్ తో కూడా అందుబాటులో ఉంది రోజూ తినే ఆహారం వెనుక దాగి ఉన్న నిజాలను తెలుసుకోవాలనుకునే వారు ఈ డాక్యుమెంటరీని మిస్ అవ్వొద్దు. వినోదంతో పాటు అవగాహన కలిగించే ఈ డాక్యుమెంటరీ, ఫాస్ట్ ఫుడ్ గురించి మీ ఆలోచనా విధానాన్నే మార్చే అవకాశం ఉంది.

Read Also: తరతరాలుగా వెంటాడే శాపం… ఆ ఇంటి తలుపు తెరిచిన క్షణం నుంచే అసలు హారర్

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×